Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 05 May 2023 13:16 IST

1. రివ్యూ: రామ‌బాణం

కొన్ని క‌ల‌యిక‌లు ప్ర‌త్యేక‌మైన అంచ‌నాల్ని... ఆస‌క్తిని రేకెత్తిస్తాయి. గోపీచంద్ - శ్రీవాస్ క‌ల‌యిక అలాంటిదే.  ల‌క్ష్యం, లౌక్యం త‌ర్వాత ఆ ఇద్ద‌రూ క‌లవ‌డమే ఆ అంచ‌నాల‌కి కార‌ణం.  విజ‌య‌వంత‌మైన ఆ క‌ల‌యిక‌లో రూపొందిన మూడో చిత్రం ‘రామ‌బాణం’ ఆరంభం నుంచీ మంచి ప్ర‌చారాన్నే సొంతం చేసుకుంది. (rama banam review) మ‌రి చిత్రం ఎలా ఉంది?గోపీచంద్‌ శైలి యాక్షన్‌ డ్రామా ఉందా? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఎస్‌సీవో విందులో.. జైశంకర్‌, బిలావల్ భుట్టో షేక్‌హ్యాండ్‌..!

భారత్‌ నేతృత్వంలో షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో SCO) విదేశాంగ మంత్రుల మండలి సమావేశం గోవా వేదికగా గురువారం ప్రారంభమైంది. ఈ సదస్సులో దాయాది పాక్‌ (Pakistan) విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ (Bilawal Bhutto-Zardari) కూడా పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో భారత్‌తో ఎలాంటి ద్వైపాక్షిక చర్చలు ఉండబోవని ముందే ప్రకటించిన భుట్టోకు.. భారత (India) విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ (S Jaishankar) మర్యాదపూర్వకంగా షేక్‌హ్యాండ్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. అది ధోనీకి మాత్రమే తెలుసు.. హర్భజన్‌ సింగ్‌

చెన్నై (Chennai Super Kings) సారథి ఎంఎస్‌ ధోనీ(MS Dhoni) రిటైర్మెంట్‌పై చర్చ కొనసాగుతూనే ఉంది. తాజాగా లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో టాస్‌ సమయంలో ధోనీ చేసిన వ్యాఖ్యలు అతడి అభిమానుల్లో జోష్‌ నింపాయి. ‘నాకిది చివరి ఐపీఎల్‌ అంటూ మీరే డిసైడ్‌ చేశారంటూ’ కామెంటేటర్‌ డానీ మారిసన్‌తో ధోనీ అనడం.. ఆ తర్వాత వ్యాఖ్యాత ‘మహీ వచ్చే ఏడాది కూడా ఆడతాడంటూ’ చెప్పడంతో స్టేడియం మార్మోగింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ‘శరద్‌ పవారే కొనసాగాలి..’ రాజీనామా తిరస్కరించిన NCP కమిటీ

పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతూ శరద్‌ పవార్‌ (Sharad Pawar) తీసుకున్న సంచలన నిర్ణయం నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (NCP) నేతలు, కార్యకర్తల్లో తీవ్ర కలవరం రేపింది. పవార్‌ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజీనామా నిర్ణయాన్ని చర్చించడంతో పాటు పార్టీ నూతన అధ్యక్షుడి ఎంపిక కోసం ఎన్‌సీపీ కమిటీ శుక్రవారం సమావేశమైంది. పవార్‌ రాజీనామాను ఈ కమిటీ తిరస్కరించింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ‘మీషో’లో మరో 250 మంది ఉద్యోగులకు ఉద్వాసన

సాఫ్ట్‌బ్యాంక్‌ మద్దతు ఉన్న ఈ-కామర్స్‌ యూనికార్న్‌ మీషో (Meesho) మరోసారి ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. కంపెనీ మొత్తం సిబ్బందిలో 15 శాతానికి సమానమైన 251 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ఉద్యోగులకు అంతర్గత ఈ-మెయిల్‌ ద్వారా సమాచారం అందజేసింది. ఏడాది వ్యవధిలో ఉద్యోగులను తొలగించడం ఇది రెండోసారి. గతంలోనూ 250 మందిని తీసివేసింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అనుష్క సినిమాపై రామ్‌చరణ్‌ ట్వీట్‌.. ఫన్నీగా రిప్లై ఇచ్చిన నవీన్‌ పొలిశెట్టి

అనుష్క, నవీన్‌ పొలిశెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty). ఇటీవల విడుదలైన ఈ టీజర్‌ నవ్వులు పూయిస్తోంది. నవీన్‌ పొలిశెట్టి తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకోగా.. అనుష్క చెఫ్‌గా తన డైలాగులతో అలరిస్తోంది. ఈ టీజర్‌పై ఇప్పటికే కొంతమంది సినీ ప్రముఖులు ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ram Charan) దీనిపై ట్వీట్‌ చేశారు. దానికి నవీన్‌ పొలిశెట్టి (Naveen Polishetty) ఇచ్చిన రిప్లై ఆకట్టుకుంటోంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. నేడే లాస్ట్.. డిగ్రీపై 7,500 పోస్టులకు అప్లై చేశారా?

 కేంద్ర ప్రభుత్వ శాఖలు/ విభాగాల్లో 7,500 ఉద్యోగాల భర్తీకి సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కీలక ప్రకటన చేసింది. దరఖాస్తులకు గడువును పొడిగించింది. మొత్తం  7,500 గ్రూప్‌ బి, గ్రూప్‌ సీ పోస్టుల కోసం కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ పరీక్ష(CGLE)లకు రిజిస్ట్రేషన్ల గడువు ఈ నెల 3తో ముగిసిన విషయం తెలిసిందే. ఆ గడువును ఈ నెల 5న రాత్రి 11గంటల వరకు పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. ఆసక్తికలిగిన అభ్యర్థులకు ఈ నెల 6వ తేదీ వరకు ఫీజు చెల్లించుకొనేందుకు అవకాశం కల్పించింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కోపం చల్లారాలంటే కోహ్లీ-గంభీర్‌ ఈ యాడ్‌లో నటించాలి: యువరాజ్‌ సూచన

విరాట్‌ కోహ్లీ (Virat Kohli), గౌతమ్‌ గంభీర్‌(Gautam Gambhir )ల మధ్య చెలరేగిన తీవ్ర వాగ్వాదంపై చర్చ ఇప్పట్లో ముగిసేట్లు లేదు. ఈ అంశంపై మాజీ ఆటగాళ్లు స్పందిస్తూనే ఉన్నారు. లఖ్‌నవూ(Lucknow Supergiants), బెంగళూరు(Royal Challengers Bangalore) మ్యాచ్‌ అనంతరం.. విరాట్‌, గంభీర్‌ కోపోద్రిక్తులై ఒకరిపై ఒకరు దూసుకెళ్లేంత పని చేశారు. వారిని ఇతర ఆటగాళ్లు విడదీసిన సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంపై మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌సింగ్‌(Yuvraj Singh) స్పందించాడు. వారిద్దరి మధ్య కోపం తగ్గేలా ఓ సరదా సూచన చేశాడు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అంతర్జాతీయ వేదికపై గిల్లికజ్జాలు.. రష్యా ప్రతినిధితో ఉక్రెయిన్‌ ఎంపీ గొడవ

తమ స్థాయి, స్థానం మరిచి రష్యా(Russia), ఉక్రెయిన్(Ukraine) ప్రతినిధులు అంతర్జాతీయ వేదికపై గొడవకు దిగారు. రష్యా ప్రతినిధి కవ్వింపు చర్యలతో ఆగ్రహానికి గురైన ఉక్రెయిన్‌ ఎంపీ ఆయనపై దాడికి దిగారు. ఈ ఘర్షణ టర్కీ(Turkey) రాజధాని అంకారా(Ankara)లో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటన దృశ్యాలు వైరల్‌గా మారాయి.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. బాలికను వేధిస్తున్న పోలీస్ కానిస్టేబుల్‌.. వీడియో వైరల్‌

ప్రజలను కాపాడాల్సిన పోలీసే ఓ బాలికపై వేధింపులకు పాల్పడిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh) రాజధాని లఖ్‌నవూలో జరిగింది. కాంట్ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ (Constable) సాదత్ అలీ కొన్ని రోజులుగా ఓ బాలికను వేధింపులకు గురి చేస్తున్నాడు. పాఠశాలకు వెళ్లి వస్తున్న సమయంల్లో వెంబడిస్తూ అభ్యంతరకరంగా మాట్లాడుతున్నాడు. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పింది. నిఘా పెట్టిన తల్లిదండ్రులు, కానిస్టేబుల్ బాలికను వెంబడిస్తుండగా వీడియో తీశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని