Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 23 Jul 2023 14:03 IST

1. ఆహారాన్ని అద్భుతంగా నిల్వ చేసే ‘అరేడియేషన్‌’.. భారత్‌లో తొలిసారి ఉల్లిపాయలపై ప్రయోగం!

దేశవ్యాప్తంగా ప్రస్తుతం టమాటా (Tamato) ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దాంతో మార్కెట్‌కు వెళ్లి వీటిని కొనాలంటేనే సామాన్యుడు వెనకడుగు వేసే పరిస్థితి. గతంలో ఉల్లిపాయల పరిస్థితి (onions) కూడా ఇలాగే ఉండేది. అందుకే భారత ప్రభుత్వం ఓ సరికొత్త సాంకేతికతను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. తొలుత దాన్ని ఉల్లిపాయలపై ప్రయోగించనుంది. దాంతో ఎక్కువ కాలం ఉల్లిపాయలు కుళ్లిపోకుండా ఉంటాయి. పైగా ఆ పంట పండించిన రైతులు సైతం నష్టాల బారిన పడకుండా చూడొచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. పక్షి లోగోకు వీడ్కోలు పలకనున్న ట్విటర్‌..!

ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ట్విటర్‌ (Twitter) లోగో నుంచి పక్షి మాయమైపోతుందని దాని యజమాని ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) పేర్కొన్నారు. కొన్నేళ్లుగా ట్విటర్‌కు ఆ పక్షిలోగో ప్రధాన చిహ్నంగా ఉన్న విషయం తెలిసిందే. లోగో మార్పు విషయాన్ని ఆయన ఆదివారం ట్వటర్‌లో వెల్లడించారు. ట్విటర్‌ను సరికొత్తగా ఏర్పాటు చేసిన ‘ఎక్స్‌ కార్ప్‌’ అనే కంపెనీలో విలీనం చేస్తున్నట్లు కొన్నళ్ల క్రితం మస్క్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మణిపుర్‌లో మరో ఘోరం.. స్వాతంత్ర్య సమరయోధుడి భార్య సజీవ దహనం

ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌(Manipur)లో మరో అరాచకం వెలుగులోకి వచ్చింది. స్వాతంత్ర్య సమరయోధుడి భార్యను ఓ సాయుధ మూక సజీవ దహనం చేసిన ఘటన చోటు చేసుకొంది. ఈ దారుణం కాక్చింగ్‌ జిల్లా సెరో గ్రామంలో జరిగింది. స్వాతంత్ర్య సమరయోధుడు ఎస్‌ చురాచాంద్‌ సింగ్‌ భార్య సోరోకైబామ్‌ ఇబెటోంబి(80)ని సజీవ దహనం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఏం సాధించావని నిద్రపోతున్నావ్‌?అని ప్రశ్నించారు: సూర్య గురించి ఈ విషయాలు తెలుసా!

తండ్రి హీరో అయినా ఆయనెప్పుడూ షూటింగ్‌ చూసేందుకు వెళ్లలేదు. నటనపై ఆసక్తి చూపలేదు. కానీ, పరిస్థితుల ప్రభావం వల్ల చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టక తప్పలేదు. కెరీర్‌ ప్రారంభంలో నటుడిగా విమర్శలు ఎదుర్కొన్న ఆయన ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడెందరికో ఆదర్శంగా నిలిచారు. ‘నటనకు పెట్టింది పేరు’ అని అనిపించుకున్నారు. ఆయనే.. అటు కోలీవుడ్‌, ఇటు టాలీవుడ్‌లో విశేష క్రేజ్‌ ఉన్న సూర్య (Suriya). నేడు పుట్టినరోజు (48వ) సందర్భంగా ఆయన గురించి పలు ఆసక్తికర విషయాలు మీకోసం పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రక్తం తీయకుండానే షుగర్‌ చెక్‌ చేసుకోవచ్చు!

ఎవరన్నారు... సరికొత్త ఆవిష్కరణలు మనదేశంలో రావనీ, మనవన్నీ ఏ విదేశీ సాంకేతికతకో అనుకరణలనీ? హైదరాబాదీ స్టార్టప్‌ ‘బ్లూ సెమీ’ తెచ్చిన ‘ఎయ్‌వా’ అన్న పరికరం అలాంటి అపోహల్ని తుడిచిపెట్టమంటోంది. చుక్క రక్తం అవసరంలేకుండా మధుమేహాన్ని కొలుస్తుందిది. కేవలం కొలిచేటప్పుడున్న షుగర్‌ లెవల్‌(ఆర్‌బీసీ) మాత్రమే కాదు... మూడునెలల సగటుని చెప్పే హెచ్‌బీఏ1సీని కూడా చూపిస్తుంది. ప్రపంచంలో వీటినిలా కొలిచే తొలి పరికరం ఇదే! షుగర్‌తోపాటూ రక్తపోటు, హార్ట్‌ రేటు, ఈసీజీ, ఎస్‌పీఓ2లని కూడా నిమిషంలో చెప్పేస్తుంది! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. జగన్‌.. ఈ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పాలి: పవన్‌

వాలంటీర్లు సేకరించే ప్రజల వ్యక్తిగత సమాచారంపై ఏపీలో గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ దీనిపై గతకొద్దిరోజులుగా వైకాపా ప్రభుత్వం, సీఎం జగన్‌కు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇదే అంశంపై పవన్‌ మరోసారి ట్వీట్‌ చేశారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఒడెస్సాలో ప్రముఖ చర్చిని కుప్పకూల్చిన రష్యా..!

ఉక్రెయిన్‌( Ukrain)లోని ఒడెస్సా నగరంలో ప్రముఖ చర్చిని రష్యా (Russia) నేలమట్టం చేసింది. నిన్న రాత్రి ఈ నగరంపై జరిగిన దాడుల్లో పురాతన చర్చితో సహా ఆరు నివాస భవనాలు దెబ్బతిన్నాయి. ఈ చర్చి దేశంలోని ప్రముఖ నిర్మాణ చిహ్నాల్లో ఒకటని ఉక్రెయిన్‌ దక్షిణ ఆపరేషనల్‌ కమాండ్‌ పేర్కొంది. ‘‘డజన్ల కొద్దీ కార్లు, అనేక భవనాల ద్వారాలు, కిటికీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి’’ అని ఆ కమాండ్‌ టెలిగ్రామ్‌ ఛానల్‌లో పేర్కొంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. హర్మన్‌ ఔట్‌పై సెకన్‌లోనే నిర్ణయమా..? అంపైర్‌ తీరుపై స్మృతి ఆగ్రహం..!

బంగ్లాదేశ్‌ (Bangladesh)- భారత్‌ (India)కు మధ్య శనివారం జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో అంపైర్లుగా వ్యవహరించిన కమ్రుజమాన్‌ (Kamruzzaman), తన్వీర్‌ అహ్మద్‌ (Tanvir Ahmed)తీరుపై భారత్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (Harmanpreet Kaur), వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన (Smriti Mandhana)ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. మ్యాచ్‌ అనంతరం ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లోనూ ఇదే విషయంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు స్మృతి మంధాన తీవ్రంగా స్పందించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. దొంగను పట్టుకొని అప్పగిస్తే.. డబ్బు కోసం వదిలేశారంటూ హోమ్‌గార్డ్‌ నిరసన

పంజాబ్‌ (Punjab)లోని పఠాన్‌కోట్‌ ప్రధాన రహదారిపై అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ హోమ్‌గార్డ్‌ రోడ్డు మధ్యలో పడుకొని నిరసనకు దిగాడు. తాను కష్టపడి దొంగను పట్టుకొని అప్పగిస్తే.. పోలీసులు డబ్బు తీసుకుని అతడిని వదిలేశారంటూ ఆరోపించాడు. నిరసన తెలుపుతున్న హోమ్‌గార్డ్‌ను ఆపే ప్రయత్నంలో ఓ పోలీసు అధికారి అతడిని కాలితో నెట్టడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. హెల్మెట్‌ ధరించి టమాటాల చోరీ

దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్ని అంటడంతో దొంగలు చోరీకి పాల్పడుతున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ పట్టణంలోని కూరగాయల మార్కెట్‌లో టమాటా ట్రేలను దొంగ ఎత్తుకెళ్లాడు. ముఖం గుర్తించకుండా హెల్మెట్‌, జాకెట్‌ ధరించిన దొంగ.. ₹6,500 విలువైన మూడు ట్రేలను దొంగిలించాడు. కమిషన్‌ ఏజెంట్ దుకాణం నుంచి రైతు తీసుకొచ్చి నిల్వ ఉంచిన మూడు టమాటా ట్రేలను దుండగుడు ఎత్తుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని