Zaheerabad: హెల్మెట్‌ ధరించి టమాటాల చోరీ

దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్ని అంటడంతో దొంగలు చోరీకి పాల్పడుతున్నారు.

Updated : 23 Jul 2023 13:59 IST

జహీరాబాద్: దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్ని అంటడంతో దొంగలు చోరీకి పాల్పడుతున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ పట్టణంలోని కూరగాయల మార్కెట్‌లో టమాటా ట్రేలను దొంగ ఎత్తుకెళ్లాడు. ముఖం గుర్తించకుండా హెల్మెట్‌, జాకెట్‌ ధరించిన దొంగ.. ₹6,500 విలువైన మూడు ట్రేలను దొంగిలించాడు. కమిషన్‌ ఏజెంట్ దుకాణం నుంచి రైతు తీసుకొచ్చి నిల్వ ఉంచిన మూడు టమాటా ట్రేలను దుండగుడు ఎత్తుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఘటనపై కమిషన్‌ ఏజెంట్‌, బాధిత రైతు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని