Twitter: పక్షి లోగోకు వీడ్కోలు పలకనున్న ట్విటర్‌..!

ట్విటర్‌(Twitter)లో పెను మార్పులకు దాని యజమాని ఎలాన్‌ మస్క్‌(Elon Musk) స్వీకారం చుట్టారు. తాజాగా దాని లోగోను కూడా మార్చేయాలని నిర్ణయించారు.

Published : 23 Jul 2023 11:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ట్విటర్‌ (Twitter) లోగో నుంచి పక్షి మాయమైపోతుందని దాని యజమాని ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) పేర్కొన్నారు. కొన్నేళ్లుగా ట్విటర్‌కు ఆ పక్షిలోగో ప్రధాన చిహ్నంగా ఉన్న విషయం తెలిసిందే. లోగో మార్పు విషయాన్ని ఆయన ఆదివారం ట్వటర్‌లో వెల్లడించారు. ట్విటర్‌ను సరికొత్తగా ఏర్పాటు చేసిన ‘ఎక్స్‌ కార్ప్‌’ అనే కంపెనీలో విలీనం చేస్తున్నట్లు కొన్నళ్ల క్రితం మస్క్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

‘‘త్వరలోనే మేం ట్విటర్‌ బ్రాండ్‌కు.. ఆ తర్వాత క్రమంగా అన్ని పక్షులకు వీడ్కోలు పలకనున్నాం. ఈ రాత్రి పోస్టు చేసిన X లోగో బాగుంటే.. రేపటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా లైవ్‌లోకి వస్తుంది’’ అని ట్వీట్‌ చేశారు. మస్క్‌ ట్విటర్‌ను గతేడాది కొనుగోలు చేసిన నాటి నుంచి ఇదే అతిపెద్ద మార్పుగా నిలవనుంది.

ఎయిరిండియా.. ఆధునిక సదుపాయాలు!

మస్క్‌కు X అనే అక్షరం అంటే విపరీతమైన ఇష్టం. ఈ విషయం కొత్తగా తెలిసిందేమీ కాదు. ట్విటర్‌ సీఈవోగా లిండా యాకరినో బాధ్యతలు చేపట్టిన సమయంలో కూడా కంపెనీని ఎవ్రీ థింగ్‌ యాప్‌ ఎక్స్‌గా మార్చడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తుందని మస్క్‌ ట్వీట్‌ చేశారు. ఇక ట్విటర్‌లోని అన్‌ వెరిఫైడ్‌ ఖాతాల నుంచి ప్రత్యక్ష సందేశాలు ఉంచడాన్ని పరిమితం చేస్తున్నట్లు శనివారం మస్క్‌ ప్రకటించారు. ‘‘డైరెక్ట్‌ మెసేజ్‌ల స్పామ్‌ను తగ్గించేందుకు మేం ప్రయత్నాలు చేస్తున్నాం. అన్‌వెరిఫైడ్‌ ఖతాల నుంచి భవిష్యత్తులో పరిమిత సంఖ్యలోనే డీఎం (డైరెక్ట్‌ మెసేజ్‌)లు చేయగలరు. నేడే సబస్క్రైబ్‌ చేసుకొని ఎక్కువ మెసేజ్‌లు పంపండి’’ అని ట్విటర్‌ పేర్కొంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని