Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 15 Aug 2023 13:18 IST

1. జుకర్‌బర్గ్‌ ఇంటికెళ్తా.. ఆయన ఇంట్లో ఉంటే అక్కడే మా ఫైట్‌: మస్క్‌ ట్వీట్

టెక్‌ దిగ్గజాలు ఎలాన్‌ మస్క్ (Elon Musk), మార్క్‌ జుకర్‌బర్గ్‌ (Mark Zukerberg) మధ్య కేజ్‌ ఫైట్‌ (Cage Fight)పై కొంత కాలంగా ఆన్‌లైన్‌లో మాటల యుద్ధం జరుగుతోంది. ఫైట్‌ కోసం మస్క్‌ డేట్లు ఇవ్వడంలేదని ఆదివారం జుకర్‌బర్గ్‌ ఆరోపించారు. ఈ నేపథ్యంలో కేజ్‌ ఫైట్‌ గురించి మస్క్‌ మరోసారి ట్వీట్‌ చేశారు. తన టెస్లా కారును (ఆటోపైలట్‌) జుకర్‌బర్గ్‌ ఇంటికి డ్రైవ్‌ చేయాలని అడుగుతానని.. మెటా సీఈవో ఇంట్లో ఉంటే అక్కడే ఫైట్‌ చేస్తానని ట్వీట్ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. బందిపోట్ల ఉచ్చులో నైజీరియా సైన్యం.. క్షతగాత్రుల కోసం వచ్చిన హెలికాప్టర్‌ కూడా కూల్చివేత

నైజీరియా(Nigeria) భద్రతా దళాలు, బందిపోట్లకు మధ్య జరిగిన భీకర పోరులో 26 మంది సైనికులు మృతి చెందారు. సెంట్రల్‌ నైజీరియాలో సైన్యాన్ని బందిపోట్లు ఉచ్చులోకి లాగి దాడి చేశారు. దీంతో ఆ బృందం ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ దాడి ఆదివారం రాత్రి చోటు చేసుకొంది. సోమవారం ఉదయం ఇక్కడి క్షతగాత్రులను కాపాడేందుకు వచ్చిన హెలికాప్టర్‌ను కూడా బందిపోట్లు కూల్చినట్లు సమాచారం. ఈ ఘటనలో కూడా పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 26 మంది మృతి చెందినట్లు భావిస్తున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ట్రంప్‌పై అత్యంత తీవ్రమైన రికో ఉల్లంఘన అభియోగాలు నమోదు..

2020 ఎన్నికల సందర్భంగా జార్జియాలో ఫలితాలను తారుమారు చేయడానికి అమెరికా (USA) మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Trump) ప్రయత్నించినట్లు అభియోగాలు నమోదయ్యాయి. 2024లో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వ రేసులో ముందున్న ట్రంప్‌పై ఈ అభియోగాలు నమోదు కావడం గమనార్హం. ఫుల్టన్‌ కౌంటీ గ్రాండ్‌ జ్యూరీ జారీ చేసిన 41-ఛార్జి డాక్యుమెంట్‌లో ట్రంప్‌ సహా 18 మందిపై వీటిని మోపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఏకధాటిగా 90 నిమిషాలు.. ప్రసంగంలో మోదీ సరికొత్త రికార్డ్‌

స్వాతంత్ర్య దినోత్సవం (Independence Day) సందర్భంగా చారిత్రక ఎర్రకోట (Red Fort) నుంచి వరుసగా పదేళ్లు మువ్వన్నెల జెండాను ఆవిష్కరించిన తొలి కాంగ్రెస్సేతర ప్రధానిగా నరేంద్రమోదీ (PM Modi) నిలిచారు. మంగళవారం ఉదయం ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ప్రధాని మోదీ జాతినుద్దేశించి సుదీర్ఘ ప్రసంగం చేశారు. 90 నిమిషాల పాటు ఏకధాటిగా మాట్లాడిన ఆయన.. పంద్రాగస్టు ప్రసంగంలో సరికొత్త రికార్డు సృష్టించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అనతికాలంలోనే తిరుగులేని విజయాలు సాధించాం: కేసీఆర్‌

గతంలో రాష్ట్రంలో ఎటు చూసినా ఆకలి కేకలు.. ఆత్మహత్యలు ఉండేవని.. విధ్వంసమైన తెలంగాణను విజయపథం వైపు నడిపించామని సీఎం కేసీఆర్‌ అన్నారు. అనతికాలంలోనే రాష్ట్రం తిరుగులేని విజయాలు సాధించిందని చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటపై జాతీయ పతాకాన్ని సీఎం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. యూట్యూబ్‌ ఫీడ్‌లో నచ్చని వీడియోలు వస్తున్నాయా? నియంత్రించేదెలా?

రోజంతా యూట్యూబ్‌ (Youtube) చూడకుండా ఉండని వారుండరంటే అతిశయోక్తి కాదు. ట్రైలరనో, టీజరనో.. ఎంటర్‌టైన్‌మెంట్‌ వీడియోలకోసమో, ఇన్‌ఫ్లూయెన్సర్ల షార్ట్స్‌ కోసమో.. రివ్యూలకనో, ప్రముఖుల వ్యూస్‌కనో.. మనం నిత్యం యూట్యూబ్‌పై ఆధారపడుతుంటాం. ఒక్కోసారి కొన్ని అంశాలను మనం యూట్యూబ్‌లో సెర్చ్‌ చేస్తుంటాం.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. రెప్‌సోల్‌ 150 బైక్‌పై ధోనీ.. వీడియో వైరల్‌

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ (Mahendra Singh Dhoni) గురించి కొత్త విషయాలు తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపిస్తుంటారు. అతడికున్న క్రేజ్‌ అలాంటిది మరి. అయితే, కెప్టెన్‌ కూల్‌కు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా నెట్టింట్లో వైరల్‌గా మారింది. రాంచీ (Ranchi)లో తన హోండా రెప్‌సోల్‌ 150(బైక్‌)పై ధోనీ రైడింగ్‌ చేస్తూ కనిపించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. 2024లో ఇంటి దగ్గరే మోదీ జెండా ఎగరవేస్తారులే..: ఖర్గే

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై చేసిన ప్రసంగంపై కాంగ్రెస్‌ తీవ్ర విమర్శలు చేస్తోంది. ముఖ్యంగా వచ్చే ఏడాది మళ్లీ ఆగస్టు 15న వస్తానని ప్రధాని మోదీ వ్యాఖ్యానించడాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ఎద్దేవా చేశారు. ‘‘ఆయన వచ్చే ఏడాది జెండా ఎగరవేస్తారు.. కానీ, అది ఆయన ఇంటిపైనే. గెలిచిన వాళ్లు ఎప్పుడూ మేమే మళ్లీ మళ్లీ వస్తామని చెబుతుంటారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఆ నిశ్శబ్ద శక్తే నడిపించింది: రాహుల్ గాంధీ

కాంగ్రెస్(Congress) అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) స్వాతంత్ర్య దినోత్సవం వేళ నెట్టింట్లో పోస్టు పెట్టారు. భరత మాత ప్రతిఒక్కరి స్వరమని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా భారత్‌ జోడో యాత్ర(Bharat Jodo Yatra) అనుభవాలను పంచుకున్నారు. ప్రజల ఆదరణతో అందిన నిశ్శబ్ద శక్తి తనకెంతో సహకరించిందన్నారు. ‘బలం, బలహీనతతో సంబంధం లేకుండా భారత మాత.. ప్రతి భారతీయుడి గళం. ఆ గళంలో ఆనందం, భయం, బాధ అంతర్గతంగా దాగి ఉంటుంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ప్రాధాన్య క్రమంలో ప్రాజెక్టుల పూర్తి: స్వాతంత్ర్య వేడుకల్లో సీఎం జగన్‌

ఏపీ వ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో సీఎం జగన్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసు బలగాల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత వివిధ ప్రభుత్వ పథకాలపై ఆయా శాఖలు ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శనను సీఎం తిలకించారు. అనంతరం జగన్‌ మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని