Elon Musk: జుకర్‌బర్గ్‌ ఇంటికెళ్తా.. ఆయన ఇంట్లో ఉంటే అక్కడే మా ఫైట్‌: మస్క్‌ ట్వీట్

కేజ్‌ ఫైట్‌ కోసం తన టెస్లా (Tesla) కారును జుకర్‌బర్గ్‌ (Mark Zukerberg) ఇంటికి డ్రైవ్‌ చేయాలని అడుగుతానని, ఆయన ఇంట్లో ఉంటే అక్కడే ఫైట్‌ చేస్తానని ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) ట్వీట్ చేశాడు.

Published : 15 Aug 2023 11:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టెక్‌ దిగ్గజాలు ఎలాన్‌ మస్క్ (Elon Musk), మార్క్‌ జుకర్‌బర్గ్‌ (Mark Zukerberg) మధ్య కేజ్‌ ఫైట్‌ (Cage Fight)పై కొంత కాలంగా ఆన్‌లైన్‌లో మాటల యుద్ధం జరుగుతోంది. ఫైట్‌ కోసం మస్క్‌ డేట్లు ఇవ్వడంలేదని ఆదివారం జుకర్‌బర్గ్‌ ఆరోపించారు. ఈ నేపథ్యంలో కేజ్‌ ఫైట్‌ గురించి మస్క్‌ మరోసారి ట్వీట్‌ చేశారు. తన టెస్లా కారును (ఆటోపైలట్‌) జుకర్‌బర్గ్‌ ఇంటికి డ్రైవ్‌ చేయాలని అడుగుతానని.. మెటా సీఈవో ఇంట్లో ఉంటే అక్కడే ఫైట్‌ చేస్తానని ట్వీట్ చేశారు.

‘‘ఈ రోజు రాత్రి నా టెస్లా కారును పాలో ఆల్టోలోని జుకర్‌బర్గ్‌ ఇంటికి తీసుకెళ్లమని చెప్తాను. అలాగే ఎక్స్‌లో లైవ్‌ స్ట్రీమింగ్‌ను కూడా పరీక్షిస్తాం. జుకర్‌బర్గ్‌ నా కోసం తలుపు తీస్తే, మీరు మా ఫైట్‌ను చూడొచ్చు’’ అని మస్క్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే, జుకర్‌బర్గ్‌ ఇంట్లో ఉండడని, ఆయన షెడ్యూల్‌ ప్రకారం వేరే చోటికి ప్రయాణమైనట్లు మెటా అధికార ప్రతినిధి తెలిపారు. దీనిపై మస్క్ స్పందిస్తూ.. ‘‘ఈ రోజు నేను ట్వీట్ చేసిన తర్వాత జుకర్‌బర్గ్‌ ఇంట్లో హడావుడిగా బ్యాగ్‌లు ప్యాక్‌ చేశారు. ఎక్కడికో ప్రయాణమైనట్లున్నాడు’’ అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. 

మస్క్‌ లైట్‌ తీసుకున్నాడు..: జుకర్‌ బర్గ్‌ అసహనం

అంతకముందు కేజ్‌ ఫైట్‌ గురించి మస్క్‌ సీరియస్‌గా లేడని, ఇకపై ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయడం మేలని జుకర్‌బర్గ్‌ థ్రెడ్స్‌లో పేర్కొన్నారు. ఈ పోస్ట్‌ గురించి ఓ నెటిజన్‌ మస్క్ దృష్టికి తీసుకెళ్లగా సోమవారం ఆయన ఇంటికి వెళతానని ట్వీట్ చేశాడు. గత కొంత కాలంగా ఈ పోరు గురించి టెక్‌ దిగ్గజాలు ఒకరిపై ఒకరు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం తమ మధ్య కేజ్‌ ఫైట్‌ను ఎక్స్‌లో లైవ్‌ స్ట్రీమ్‌ అవుతుందని మస్క్‌ ట్వీట్ చేశాడు. అయితే, ఇది ఎప్పుడు జరుగుతుందనే దానిపై మాత్రం ఇరువురు స్పష్టతనివ్వలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని