PM Modi: ఏకధాటిగా 90 నిమిషాలు.. ప్రసంగంలో మోదీ సరికొత్త రికార్డ్‌

Modi's Independence Day Speech: ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ఎగురవేసిన ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి 90 నిమిషాల పాటు ఏకధాటిగా ప్రసంగించారు.

Updated : 15 Aug 2023 15:24 IST

దిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవం (Independence Day) సందర్భంగా చారిత్రక ఎర్రకోట (Red Fort) నుంచి వరుసగా పదేళ్లు మువ్వన్నెల జెండాను ఆవిష్కరించిన తొలి కాంగ్రెస్సేతర ప్రధానిగా నరేంద్రమోదీ (PM Modi) నిలిచారు. మంగళవారం ఉదయం ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ప్రధాని మోదీ జాతినుద్దేశించి సుదీర్ఘ ప్రసంగం చేశారు. 90 నిమిషాల పాటు ఏకధాటిగా మాట్లాడిన ఆయన.. పంద్రాగస్టు ప్రసంగంలో సరికొత్త రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు 10 సార్లు మోదీ ప్రసంగించగా.. సగటు సమయం 82 నిమిషాలుగా ఉంది. దేశ చరిత్రలో ఇతర ప్రధానులు మాట్లాడిన సగటు ప్రసంగ సమయం కంటే ఇది ఎక్కువ కావడం విశేషం.

త్వరలో కొత్త పథకం.. ₹లక్షల్లో ప్రయోజనం: ఎర్రకోట నుంచి మోదీ ప్రకటన

  • 2014లో ప్రధానమంత్రిగా ఎర్రకోట నుంచి మోదీ తొలి ప్రసంగం చేసిన విషయం తెలిసిందే. ఆ ఏడాది 65 నిమిషాల పాటు ఆయన మాట్లాడారు.
  • ఆ తర్వాత 2015లో 86 నిమిషాలు ప్రసంగించారు. ఇక, 2016లో ఏకంగా 96 నిమిషాల పాటు ప్రసంగం చేశారు. ప్రధాని ఇప్పటివరకు చేసిన పంద్రాగస్టు ప్రసంగాల్లో ఇదే సుదీర్ఘం.
  • ఇక, 2017లో గంట కంటే తక్కువే 56 నిమిషాల పాటు మాట్లాడారు. ఆ మరుసటి ఏడాది 83 నిమిషాలు ప్రసంగించారు.
  • 2019లో రెండోసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత పాల్గొన్న తొలి స్వాతంత్ర్య వేడుకల్లో 92 నిమిషాల పాటు ప్రసంగం చేశారు.
  • ఇక, 2020లో 90 నిమిషాలు, 2021లో 88 నిమిషాలు మాట్లాడారు.
  • గతేడాది 74 నిమిషాలు ప్రసంగించిన ప్రధాని.. ఈ ఏడాది మళ్లీ 90 నిమిషాల పాటు సుదీర్ఘ ప్రసంగం చేశారు.
  • మొత్తంగా ప్రధాని సగటు ప్రసంగం నిడివి 82 నిమిషాలు కాగా.. ఇప్పటివరకు దేశ చరిత్రలో ఏ ప్రధాని కూడా సగటుగా ఇంత సమయం పంద్రాగస్టు వేడుకల్లో ప్రసంగించలేదు.
  • ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ మొట్టమొదటి ప్రసంగం చేశారు. 24 నిమిషాల పాటు ఆయన మాట్లాడారు.
  • ప్రధానిగా ఇప్పటివరకు అత్యధిక పంద్రాగస్టు ప్రసంగాలు చేసింది కూడా నెహ్రూనే. మొత్తంగా 17 సార్లు ఆయన స్వాత్రంత్య దినోత్సవం నాడు జాతినుద్దేశించి ప్రసంగించారు.
  • మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 16 సార్లు పంద్రాగస్టు నాడు మాట్లాడారు. 1972లో సుదీర్ఘంగా 54 నిమిషాలు ప్రసంగించారు.
  • ఇక, మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్‌ కేవలం ఒకే ఒక్కసారి ఎర్రకోట నుంచి ప్రసంగించారు. 1997లో ఆయన 71 నిమిషాల పాటు మాట్లాడారు. ప్రధాని మోదీ తర్వాత రెండో అత్యధిక సగటు ప్రసంగ సమయం ఈయనదే.
  • మాజీ ప్రధానులు మన్మోహన్‌ సింగ్‌, అటల్‌ బిహరీ వాజ్‌పేయీ స్వల్ప ప్రసంగాలు చేశారు. 2012లో మన్మోహన్‌ సింగ్‌ 32 నిమిషాలు, 2013లో 35 నిమిషాలు మాట్లాడారు.
  • వాజ్‌పేయీ 2002లో 25 నిమిషాలు, 2003లో 30 నిమిషాల పాటు ప్రసంగించారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని