Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 04 Dec 2023 12:57 IST

1. ‘మిగ్‌జాం’ ఎఫెక్ట్‌.. స్తంభించిన చెన్నై

మిగ్‌జాం తుపాను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. సోమవారం తెల్లవారుజాము నుంచి చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని 14 రైల్వే సబ్‌వేల్లోకి నీరు చేరడంతో వాటిని మూసివేశారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం నగరం, చుట్టుపక్కల జిల్లాల్లో మరో 24 గంటలపాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను ఇప్పటికే చెన్నైలో మోహరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2.  మిగ్‌జాం ఎఫెక్ట్‌.. కోస్తాంధ్రకు రెడ్‌ అలర్ట్‌

నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన మిగ్‌జాం తుపాను కారణంగా కోస్తాంధ్రకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఈ నేపథ్యంలో తీరప్రాంత జిల్లాల్లో పాఠశాలలకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. తీరప్రాంతంలోని అన్ని జిల్లాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు. తుపాను ప్రభావంతో విశాఖ, గోదావరి జిల్లాలు, బాపట్ల, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో పలు విమానాలు సైతం రద్దయ్యాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మిజోరంలో కొనసాగుతున్న కౌంటింగ్‌.. ఆధిక్యంలో ప్రతిపక్ష పార్టీ

ఈశాన్య రాష్ట్రం మిజోరం (Mizoram)లో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల (Assembly polls)కు సోమవారం ఓట్ల లెక్కింపు (Counting) కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభించగా.. తొలుత పోస్టల్‌ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. ఆ తర్వాత ఈవీఎం ఓట్ల కౌంటింగ్‌ చేపట్టారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. నా మాటలను భాజపా వక్రీకరించింది.. సనాతన వివాదంపై ఉదయనిధి

సనాతన వివాదంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ (Udhayanidhi Stalin) మరోసారి స్పందించారు. నిన్న కరూర్‌ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, భాజపాను తప్పుపట్టారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని తాను చేసిన ప్రకటనపై మరోసారి వివరణ ఇచ్చుకొన్నారు. తాను గతంలో చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ వాడుకొన్నారని ఆరోపించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కాజీపేట-విజయవాడ మార్గంలో పలు రైళ్ల రద్దు

కాజీపేట-వరంగల్ రైల్వేస్టేషన్ల మధ్య జరుగుతున్న మూడోలైను పనుల కారణంగా కాజీపేట-విజయవాడ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గుంటూరు-సికింద్రాబాద్ ఇంటర్‌ సిటీ ఈ నెల 10 నుంచి 18 వరకు, సికింద్రాబాద్- విజయవాడ శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 7వ తేదీతోపాటు 10 నుంచి 18 వరకు, సికింద్రాబాద్-భద్రాచలం రోడ్డు కాకతీయ ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 6వ తేదీతోపాటు, 10 నుంచి 18 వరకు, ఆదిలాబాద్-తిరుపతి కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను ఈనెల 5 నుంచి 19 వరకు రద్దు చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కుటుంబం బాధలో ఉన్నా.. పార్టీని గెలిపించారు: నడ్డాపై ప్రధాని ప్రశంసలు

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections 2023) మూడు రాష్ట్రాల్లో భాజపా (BJP) స్పష్టమైన మెజార్టీతో అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో ప్రధాని మోదీ (PM Modi) మాట్లాడుతూ.. పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda)పై ప్రశంసలు కురిపించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. తుపాను ఎఫెక్ట్‌.. విశాఖ నుంచి పలు విమాన సర్వీసులు రద్దు

మిగ్‌జాం తుపాను (Cyclone Michaung) ప్రభావం కారణంగా పలు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఇండిగో సంస్థ ప్రకటించింది. విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్లాల్సిన రెండు విమాన సర్వీసులను నిలిపివేసింది. విశాఖ నుంచి హైదరాబాద్‌ బయలుదేరాల్సిన రెండు సర్వీసులు, ఒక విజయవాడ సర్వీసును రద్దు చేసినట్లు తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ముగిసిన సీఎల్పీ సమావేశం.. కీలక నేతలతో డీకే శివకుమార్‌ భేటీ

కాంగ్రెస్‌ శాసనసభాపక్ష (సీఎల్పీ) (Congress) సమావేశం ముగిసింది. గచ్చిబౌలిలోని ఓ హోటల్‌లో ఆ పార్టీ ఎమ్మెల్యేలతో ఏఐసీసీ పరిశీలకులు సమావేశమయ్యారు. సీఎల్పీ నేత ఎంపికకు ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. సమావేశం అనంతరం ఎమ్మెల్యేల అభిప్రాయాలతో కూడిన నివేదికను అధిష్ఠానానికి పంపనున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ అధిష్ఠానం సీఎల్పీ నేత ఎంపికపై నిర్ణయం తీసుకోనుంది. సాయంత్రానికి సీఎం ప్రమాణస్వీకారం చేసేందుకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. తుపాను ఎఫెక్ట్‌.. ఏపీ వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలు

నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన మిగ్‌జాం తుపాను(Cyclone Michaung) ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ, గోదావరి జిల్లాలు, బాపట్ల, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈదురు గాలులతో కొన్ని ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. వరదనీటితో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ‘మీ ఓటమి అసహనాన్ని పార్లమెంట్‌లో చూపించొద్దు’: కాంగ్రెస్‌కు మోదీ సూచన

ఉత్తరాదిన మూడు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో (Assembly Election Results) కాషాయ జెండా రెపరెపలాడిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లో కమలం పార్టీ విజయ ఢంకా మోగించింది. ఈ ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) మరోసారి స్పందించారు. ప్రజలు నెగెటివిటీని తిరస్కరించారని ప్రతిపక్షాలనుద్దేశిస్తూ విమర్శలు గుప్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు