Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 13 May 2023 17:05 IST

1. కర్ణాటక ఎన్నికల ఫలితాలు.. తెలంగాణపై ప్రభావం చూపవు: కేటీఆర్‌

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించడంపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్న కాంగ్రెస్‌ పార్టీకి కేటీఆర్‌ అభినందనలు తెలిపారు. ‘‘ ‘ది కేరళ స్టోరీ’.. కర్ణాటక ఓటర్లపై ప్రభావం చూపించడంలో పూర్తిగా విఫలమైంది. అదే మాదిరిగా కర్ణాటక ఎన్నికల ఫలితాలు కూడా తెలంగాణపై ఎలాంటి ప్రభావాన్ని చూపించబోయేది లేదు’’ అని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. 36 వేలమంది టీచర్ల తొలగింపు!

ఉపాధ్యాయుల నియామకాల్లో కుంభకోణం కేసులో కలకత్తా హైకోర్టు  కీలక ఆదేశాలు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాల్లో గతంలో నియమితులైన 36 వేల మంది ఉపాధ్యాయ నియామకాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. నియామక ప్రక్రియలో విధివిధానాలను పాటించలేదని పేర్కొంటూ వీరి నియామకాలను రద్దు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. అట్లుంటది.. మా సూర్యతోని: రోహిత్ శర్మ ప్రశంసలు

ఐపీఎల్‌ 2023 (IPL 2023) సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌పై ముంబయి ఇండియన్స్‌ (MI vs GT) ప్రతీకార విజయం సాధించింది. ముంబయి బ్యాటర్ సూర్యకుమార్‌ (103*) శతకంతో విజృంభించడంతో ముంబయి 218 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే, రషీద్ ఖాన్‌ (79*) కాస్త హడలెత్తించినా చివరికి గెలుపు ముంబయిదే అయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. సిద్ధా.. శివ.. ముఖ్యమంత్రి ఎవరు..?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌(Congress)కు ఓటర్లు విస్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టారు. 2004 నుంచి ఆ పార్టీకి స్థాయి మెజార్టీ రావడం రెండోసారి. ఈ సారి ముఖ్యమంత్రి స్థానానికి పార్టీకి చెందిన దిగ్గజ నేతలు పోటీపడుతున్నారు. ఈ రేసులో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Siddaramaiah), రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ముందంజలో ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కర్ణాటకలో కమలం వాడిపోవడానికి కారణాలెన్నో..!

కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో అధికార భాజపా చతికిలపడింది. గతంలో సాధించిన సీట్లలో దాదాపు 40కిపైగా ఈ సారి కోల్పోయింది. కేవలం కొన్ని సామాజిక వర్గాలపై ఆధారపడటం.. అవినీతి విషయంలో కఠిన చర్యలు తీసుకోకపోవడం.. రిజర్వేషన్ల తేనెతుట్టెను ఎన్నికలకు ముందు కదపడం వంటివి కమలం విజయావకాశాలను దెబ్బతీశాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. సోనియాకు మాటిచ్చినట్టే..: ఉద్వేగానికి గురైన డీకే

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) ఫలితాల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖరారైంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పార్టీ రాష్ట్ర చీఫ్ డీకే శివకుమార్ (DK Shivakumar) ఉద్వేగానికి గురయ్యారు. కర్ణాటకలో పార్టీని గెలిపిస్తానని సోనియాగాంధీకి మాట ఇచ్చానని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఫలించని బ్రహ్మానందం ప్రచారం.. హీరో నిఖిల్‌కు మరో ఫ్లాప్‌.. గాలి కుటుంబానికి నిరాశ

కర్ణాటక విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించింది. అత్యధిక స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పలువురు అభ్యర్థుల తరపున సినీ నటులు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలుగు హాస్యనటుడు బ్రహ్మానందం కూడా ఎన్నికల ప్రచారం చేశారు. భాజపా అభ్యర్థి, మంత్రి డాక్టర్‌ కె.సుధాకర్‌కు ఓటు వేసి గెలిపించాలని తెలుగులో విన్నవించారు. తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాల్లో సుధాకర్‌ ఓటమి పాలయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కన్నడనాట.. ‘హస్త’వాసిని మార్చిన ‘పంచ’తంత్రం

వరుస ఓటములతో అస్థిత్వాన్ని కోల్పోయే ప్రమాదం అంచు వరకు వెళ్లిన హస్తం పార్టీ.. తిరిగి బలంగా పుంజుకుంది. ఏడాది ఆరంభంలో హిమాచల్‌ప్రదేశ్‌ ఇచ్చిన విజయోత్సాహం.. కాంగ్రెస్‌ నేతల్లో బూస్ట్‌ నింపింది. అదే జోరుతో ఇప్పుడు దక్షిణాదిలో కీలక రాష్ట్రమైన కర్ణాటక (Karnataka)ను చేజిక్కించుకుంది. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను మించి శనివారం వెలువడిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీ ఘన విజయం సాధించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ‘మా నాన్న సీఎం కావాలి’..యతీంద్ర సిద్ధరామయ్య

కర్ణాటక(Karnataka) మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Siddaramaiah) తనయుడు యతీంద్ర సిద్ధరామయ్య ( Yathindra Siddaramaiah) కాంగ్రెస్(Congress) విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు తగ్గట్టుగా తన తండ్రి పూర్తి మెజార్టీ సాధిస్తారని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తన తండ్రి ముఖ్యమంత్రి కావాలని వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఆ సెంచరీ సాధించాక.. అలా అనుకున్నా: విరాట్ కోహ్లీ

విరాట్ కోహ్లీ (Virat Kohli) తన కెరీర్‌లో దాదాపు మూడేళ్లపాటు ఒక్క సెంచరీ లేకుండా మ్యాచ్‌లను ఆడాడు. అర్ధశతకాలు సాధించినా.. వాటిని శతకాలుగా మార్చడంలో మాత్రం విఫలమై విమర్శలు ఎదుర్కొన్నాడు. దీంతో దాదాపు నెల రోజులపాటు క్రికెట్‌కు విరామం ఇచ్చి మరీ మైదానంలోకి దిగాడు. గతేడాది టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఆసియా కప్‌ టోర్నీలో అఫ్గానిస్థాన్‌పై సెంచరీ సాధించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని