Top Ten News @ 5PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. జులై, ఆగస్టు కోటా ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లు 24న విడుదల: తితిదే
జులై, ఆగస్టు నెలలకు సంబంధించి రూ.300ల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఈనెల 24న విడుదల చేయనున్నట్లు తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. బుధవారం ఉదయం 10గంటలకు ఆన్‌లైన్ అందుబాటులో ఉంచుతామని వెల్లడించింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి తితిదే వెబ్‌సైట్ https://tirupatibalaji.ap.gov.inలో దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని తితిదే అధికారులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. నేను ప్రతీకారం మొదలెడితే ఊహకు కూడా అందదు!: నెల్లూరు డిప్యూటీ మేయర్
నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ అనుచరుడు, వైకాపా విద్యార్థి నేత హాజీపై శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ప్రస్తుతం హాజీ నెల్లూరులోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హాజీని ఇవాళ రూప్‌కుమార్ యాదవ్ పరామర్శించారు. తన అనుచరుడిపై జరిగిన దాడిపై రూప్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. కొలువుదీరిన శివరామయ్య రాజ్యం.. సిద్ధూ, డీకే ప్రమాణ స్వీకారం
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర 24వ ముఖ్యమంత్రిగా సీనియర్ నేత సిద్ధరామయ్య శనివారం ప్రమాణస్వీకారం చేశారు. ఉపముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణం చేశారు. కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ వీరి చేత ప్రమాణం చేయించారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. తప్పులను కవర్ చేసేందుకే నోట్ల ఉపసంహరణ: విపక్షాలు
చలామణిలో ఉన్న రూ.2వేల నోట్ల ఉపసంహరణ నిర్ణయంపై విపక్షాలు భగ్గుమన్నాయి. ఈ చర్యను మరో డీమానిటైజేషన్‌గా అభివర్ణిస్తూ కేంద్రంపై విమర్శలు గుప్పించాయి. తప్పులను కప్పిపుచ్చేందుకే మోదీ సర్కారు ఈ నోట్ల ఉపసంహరణ అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. దీనిపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఈ చర్యను కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు ఖండించాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. గూగుల్ సీఈవో చిన్ననాటి ఇల్లు విక్రయం.. తండ్రి కన్నీటిపర్యంతం!
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ (Sundar Pichai) తమిళనాడు (Tamil Nadu)లో పుట్టి పెరిగిన ఇంటిని విక్రయించారు. తమిళ సినీ నటుడు, నిర్మాత సి.మణికందన్ (C Manikandan) కొనుగోలు చేశారు. చెన్నై (Chennai)లోని అశోక్ నగర్‌లో సుందర్ పిచాయ్ నివసించిన ఇల్లు (Sundar Pichai Home) అమ్మకానికి ఉందని తెలిసిన క్షణమే దాని కొనుగోలుకు మణికందన్ ముందుకు వచ్చినట్లు ఓ వార్తాసంస్థ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. మరోసారి సుప్రీంకు చేరిన ‘దిల్లీ అధికారాల’ పంచాయితీ
దేశ రాజధాని దిల్లీలో ప్రభుత్వాధికారులపై ఎవరి నియంత్రణ ఉండాలన్న విషయంపై గత కొన్నేళ్లుగా కేంద్రం, ఆప్(Center vs Delhi) ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పోరాటం సుప్రీంకోర్టు(Supreme Court) తీర్పు వచ్చినా ఓ కొలిక్కిరాలేదు. దాంతో ఆ పంచాయితీ మరోసారి అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. దిల్లీ(Delhi)లో ప్రభుత్వాధికారులపై నియంత్రణ విషయంలో ఇటీవల సుప్రీంకోర్టు దిల్లీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. మోదీ- జెలెన్‌స్కీ ప్రత్యక్ష భేటీ.. యుద్ధం మొదలైన అనంతరం ఇదే మొదటిసారి!
జపాన్ (Japan)లో జరుగుతోన్న జీ7 సదస్సు (G7 Summit) క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi).. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelenskyy)ని కలిశారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య మొదలు ఈ ఇద్దరు నేతలు ప్రత్యక్షంగా భేటీ కావడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా ఇరుదేశాల ప్రతినిధులు చర్చలు జరిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. ₹2 వేల నోటు ఉపసంహరణ ప్రయోజనకరమే: మాజీ సీఈఏ
ఆర్థిక వ్యవస్థ నుంచి రూ.2,000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన శుక్రవారం చేసిన ఆకస్మిక ప్రకటన.. విపక్షాల విమర్శలకు దారితీసింది. ఈ నిర్ణయంతో సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని నిపుణులు చెబుతున్నా.. ప్రతిపక్షాలు మాత్రం కేంద్రంపై భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించిన ఆర్థిక శాఖ మాజీ ప్రధాన సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్.. ఈ నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనకరమేనన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. టెర్రరిస్టులు దొరక్క.. బిస్కెట్లు తినేసి వెళ్లిపోయారు..!
పాకిస్థాన్(Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) ఇంట్లో టెర్రరిస్టులు నక్కారంటూ ఇటీవల పంజాబ్ మంత్రి ఒకరు తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దానిలో భాగంగా శుక్రవారం పోలీసు బృందం ఇమ్రాన్ ఇంట్లో సోదాలు నిర్వహించింది. మాజీ ప్రధానితో చర్చలు జరిపింది. ఇమ్రాన్ చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ ఇఫ్తికార్ గుమాన్ ఈ సోదాలపై వ్యంగ్యంగా స్పందించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. మాకు ఇంకా షాకింగ్‌గానే ఉంది: సంజూ శాంసన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్‌లో (IPL 2023) రాజస్థాన్ రాయల్స్ తన చివరి లీగ్ మ్యాచ్‌లో విజయం సాధించింది. ధర్మశాల వేదికగా పంజాబ్‌ను ఓడించి సాంకేతికంగా ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసులో నిలిచింది. ప్రస్తుతం రాజస్థాన్ 14 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఆదివారం మంబయి, బెంగళూరు తమ చివరి మ్యాచుల్లో ఓడిపోతే రాజస్థాన్‌కు అవకాశాలు ఉంటాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Long Covid: దీర్ఘకాలిక కొవిడ్‌తో క్యాన్సర్‌ను మించి ఇబ్బందులు
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
Raghu Rama: నా వైద్య పరీక్షల నివేదికలను ధ్వంసం చేయబోతున్నారు
-
Ap-top-news News
Pradhan Mantri Matru Vandana Yojana: రెండో కాన్పులో అమ్మాయి పుడితే రూ.6వేలు
-
General News
Hyderabad News: చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం..
-
Ap-top-news News
అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే మార్గదర్శిపై దాడులు: కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్