Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 22 Feb 2024 08:59 IST

1. YS Sharmila: నాకు ఈ పరిస్థితి రావడం మీకు అవమానం కాదా?: షర్మిల

నిరుద్యోగుల పక్షాన పోరాటానికి పిలుపునిస్తే నిర్బంధిస్తారా? అని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు లేదా?అని నిలదీశారు. గురువారం ‘చలో సెక్రటేరియట్‌’కు రాష్ట్ర కాంగ్రెస్‌ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లోనే షర్మిల నిద్రించారు. పూర్తి కథనం

2. అంతా అడ్డగోలు.. భక్తుల సొమ్ము మట్టిపాలు

ఆలయాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నారంటే ఎంత ప్రణాళిక ఉండాలి.. మరెంత ముందు చూపు ఉండాలి.. కానీ అన్నవరంలో అదే కొరవడింది. గత ఏడాది కాలంలో దేవస్థానం వద్ద చేపట్టిన అభివృద్ధి పనుల్లో డొల్లతనానికి తావిచ్చారు. అంతర్గత రహదారులంటూ ఇష్టారాజ్యంగా రోడ్లు తవ్వేశారు.. అత్యవసరం అన్నట్లు అడ్డదారులు వేసేశారు. పూర్తి కథనం

3. ఆతిథ్య రంగంలో అద్భుత కెరియర్‌! 

బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సు ఎక్కువమందికి ఉపాధి కల్పిస్తూ ఆతిథ్య రంగం విస్తరిస్తోంది. పర్యాటకానికి సమాజంలో ఆదరణ పెరుగుతోంది. బయట తినడం, నచ్చిన ప్రాంతల్లో సేదదీరడం సాధారణమయ్యాయి. దీంతో ఈ రంగంలో నైపుణ్యం ఉన్నవారికి కొలువులు లభిస్తున్నాయి. ఆసక్తి ఉన్న ఇంటర్మీడియట్‌ విద్యార్థులు జాతీయ స్థాయిలో పేరున్న సంస్థల్లో హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు పూర్తిచేసుకుని అవకాశాల బాట పట్టవచ్చు. వీటిలో ప్రవేశానికి ఎన్‌సీహెచ్‌ఎం- జేఈఈ 2024 ప్రకటన వెలువడింది! పూర్తి కథనం

4. ప్రజారోగ్యం పట్టదా.. జగనన్నా?

ముఖ్యమంత్రి జగన్‌ పాలనలో స్థానిక సంస్థలు నిర్వీర్యమయ్యాయి. ఫలితంగా గ్రామాలు, పట్టణాల్లో అయిదేళ్లలో చెప్పుకొందామన్నా పెద్దగా అభివృద్ధి కనిపించడం లేదు. చివరికి అమృత్‌ పథకంలో భాగంగా కేంద్రం మంజూరు చేసిన మురుగునీటి శుద్ధి ప్లాంటు (ఎస్టీపీ) నిర్మాణ పనుల్లోనూ పెద్దగా పురోగతి లేదు. దీంతో పుర, నగరపాలక సంస్థల్లోని జలవనరులు కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి. భూగర్భ జలాలు సైతం కలుషితమవుతున్నాయి. పూర్తి కథనం

5. ఒత్తిడిని చిత్తు చేసే ఆర్‌ఆర్‌ఆర్‌ మంత్ర!

చదవాల్సిన పాఠ్యాంశాలు, రాయాల్సిన అసైన్‌మెంట్లూ ఏడాది పొడవునా ఎన్నో ఉంటాయి. వీలు చూసుకుని మెల్లగా ఒకదాని తర్వాత మరోటి చేసేద్దాం అనుకోవడానికి వీల్లేదు. నిర్ణీత  సమయం లోపలే అన్నింటినీ పూర్తిచేయాల్సివుంటుంది. ఇలా విపరీతమైన నిరంతర ఒత్తిడితో శారీరకంగా, మానసికంగా అలసిపోవడమే బర్న్‌ అవుట్‌! మరి దీనికేం చేయాలి? పూర్తి కథనం

6. ఎవరివి? ఎక్కడివి?

రూ.15వేల రుణం ఇస్తామని అమాయక మహిళలను నమ్మించి వారి నుంచి అవసరమైన పత్రాలు తీసుకున్నారు. వారికి  తెలియకుండానే అతివల పేరిట బ్యాంకు ఖాతాను తెరచి రూ.లక్షల్లో సొమ్ము అందులో పోగేశారు. తీగ లాగితే డొంక కదిలినట్టు బ్యాంకు సిబ్బంది, బాధితుల      విచారణలో ఆశ్చర్యకర విషయాలు వెలుగుచూశాయి. తమ పేరిట బ్యాంకు ఖాతాలో రూ.లక్షలున్నాయని తెలుసుకుని, ఆ సొమ్ము ఎలా వచ్చిందో తెలియక  మహిళలు ఆందోళన చెందుతున్నారు. పూర్తి కథనం

7. 15 స్థానాలూ గెలుద్దాం

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 2014 ఎన్నికల ఫలితాలు పునరావృతం కావాలి. మొత్తం 15 అసెంబ్లీ స్థానాల్లో తెదేపా, జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించుకుందామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సూచించారు. రానున్న ఎన్నికల్లో జిల్లా నుంచి వెలువడే ఫలితాలు కీలకం కానున్నాయన్నారు. విజయానికి రెండు పార్టీల నాయకులు, కార్యకర్తల సమన్వయమే ప్రధానం అవుతుందని వివరించారు. పూర్తి కథనం

8. ఈ ఏడాది వేతనాలు 9.5% పెరగొచ్చు: సర్వే

ప్రస్తుత సంవత్సరంలో దేశంలో వేతనాలు సగటున 9.5% పెరిగే అవకాశం ఉందని, 2023 పెరుగుదల అయిన 9.7% కంటే ఇది స్వల్పంగా తక్కువని ఓ సర్వే తెలిపింది. అంతర్జాతీయ వృత్తి నిపుణుల సేవల సంస్థ ఎయాన్‌ పీఎల్‌సీ ఈ సర్వే నిర్వహించింది. ఇందుకోసం 45 రంగాలకు చెందిన 1,414 కంపెనీల డేటాను విశ్లేషించింది. పూర్తి కథనం

9. మంత్రి అమర్‌నాథ్‌కు జగన్‌ ఝలక్‌

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు సీఎం జగన్‌ మరో ఝలక్‌ ఇచ్చారు. విశాఖకు ఈ నెల 22న రానున్న ఉప రాష్ట్రపతి ధన్‌ఖడ్‌కు ప్రభుత్వం తరఫున స్వాగతం పలికే బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించారు. మంత్రిగా అమర్‌నాథ్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత విశాఖకు ప్రముఖులు వచ్చే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వాగతం పలికే బాధ్యతను ఆయనకు అప్పగించారు. పూర్తి కథనం

10. సంతానభాగ్యం

అత్యాధునిక ఆరోగ్య సదుపాయాలు, నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉండటంతో క్లిష్టమైన చికిత్సల కోసం దేశ, విదేశాల నుంచి రోగులు హైదరాబాద్‌ వస్తున్నారు. దేశంలోనే భాగ్యనగరం వైద్య పర్యటకంగా వేగంగా ఎదుగుతోంది. రోగులకు చికిత్స కోసమే కాదు.. సంతానం లేని తల్లిదండ్రులు సైతం తమ లోపాలను సరిచేసుకోవడానికి దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచే కాకుండా విదేశాల నుంచి వచ్చి ఇక్కడ చికిత్స తీసుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు. పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని