Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 18 Apr 2024 21:07 IST

1. 102 స్థానాలు.. 16 కోట్ల మంది ఓటర్లు.. తొలిదశ పోలింగ్‌కు సర్వం సిద్ధం

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో 18వ సార్వత్రిక ఎన్నికల (Lok Sabha polls) ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. తొలిదశలో భాగంగా మొత్తం 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు శుక్రవారం (ఏప్రిల్‌ 19న) పోలింగ్‌ నిర్వహించనున్నారు. దీంతోపాటు అరుణాచల్ ప్రదేశ్‌లో 60, సిక్కింలో 92 అసెంబ్లీ స్థానాలకూ ఓటింగ్‌ జరగనుంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2.రాష్ట్రంలో లిక్కర్‌ మాఫియా రాజ్యమేలుతోంది: వైఎస్‌ షర్మిల

రాష్ట్రంలో లిక్కర్‌ మాఫియా రాజ్యమేలుతోందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. మద్య నిషేధం అమలు చేస్తామన్న జగన్‌ హామీ గంగలో కలిసిపోయిందని ఎద్దేవా చేశారు. ల్యాండ్‌, శాండ్‌ మాఫియాలు రాష్ట్రంలోని వనరులను దోచుకున్నాయని విమర్శించారు. అనంతపురం జిల్లా నార్పలలో నిర్వహించిన కాంగ్రెస్‌ న్యాయ్‌  యాత్రలో షర్మిల మాట్లాడారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం: కేసీఆర్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత బాగా ఉందని భారాస అధినేత కేసీఆర్‌ అన్నారు. తెలంగాణభవన్‌లో పార్టీ లోక్‌సభ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు. కాంగ్రెస్‌ నేతలు కొందరు తనతో టచ్‌లో ఉన్నారని, అక్కడ అంతా భాజపా పెత్తనమే నడుస్తోందని వారు చెప్పారని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?

దేశంలో సార్వత్రిక ఎన్నికలు (Lok Sabha Elections) మొత్తం ఏడు దశల్లో జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి పలు ప్రాంతాల్లో నామినేషన్ల ప్రక్రియ ముగియగా, మరికొన్నిచోట్ల ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలో ‘బీ ఫారం’ అనే మాట వింటుంటాం. అసలు ఇదేంటనే విషయాన్ని పరిశీలిస్తే.. ఏదైనా రాజకీయ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారా లేక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారా? అనే దానిని అభ్యర్థులు తమ నామినేషన్‌ పత్రాల్లో తెలియజేస్తారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. జీహెచ్‌ఎంసీ పరిధిలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం

జీహెచ్‌ఎంసీ పరిధిలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిపోతోంది. గురువారం మధ్యాహ్నం రికార్డు స్థాయిలో 4,053 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ మైలురాయిని అధిగమించిది. 2023 ఏప్రిల్ 18న గరిష్ఠ డిమాండ్ 3,471 మెగావాట్లు. గతేడాదితో పోల్చితే ప్రస్తుతం 582 మెగావాట్ల డిమాండ్ పెరిగినప్పటికీ అధికారులు ఏలాంటి అంత‌రాయం లేకుండా నిరంత‌రం స‌ర‌ఫ‌రా చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. రుణం కోసం ‘చావు తెలివి’.. మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..!

 బ్యాంకు రుణం కోసం కొందరు తప్పుడు మార్గాలు వెతుకుతుంటారు. నకిలీ దస్త్రాలు సృష్టించి రుణం పొందేందుకు ప్రయత్నించిన దాఖలాలు ఉన్నాయి. కానీ, ఓ మహిళ మాత్రం ఏకంగా చనిపోయిన వ్యక్తి పేరుపై రుణం పొందేందుకు అతడినే బ్యాంకుకు తీసుకువచ్చింది. మృతదేహాన్ని వీల్‌ఛైర్‌లో కూర్చోబెట్టి అతడు ప్రాణాలతో ఉన్నట్లు నమ్మించే ప్రయత్నం చేయడం గమనార్హం. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. పదవి కోసం పెద్దిరెడ్డి నా కాళ్లు పట్టుకున్నారు: కిరణ్‌కుమార్‌రెడ్డి

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై మాజీ సీఎం, రాజంపేట భాజపా అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. అన్నమయ్య జిల్లా పీలేరు తెదేపా అభ్యర్థిగా నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పీలేరు ఏర్పాటు చేసిన సభలో కిరణ్‌ కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8.లోక్‌సభ ఎన్నికలు.. ద్రవిడనాట ‘భాజపా’ బోణీ కొట్టేనా?

లోక్‌సభ ఎన్నికలకు (Lok Sabha Elections) తమిళనాడు సిద్ధమైంది. రాష్ట్రంలో (Tamil Nadu) ప్రాంతీయ పార్టీల ప్రాభవాన్ని అడ్డుకోవాలని భావిస్తోన్న భాజపా.. మునుపెన్నడూ లేనివిధంగా విస్తృత ప్రచారం నిర్వహించింది. ఎలాగైనా ద్రవిడనాట పాగా వేయాలనే సంకల్పంతో ఉన్న ప్రధాని మోదీ (Narendra Modi).. రాష్ట్ర చరిత్రలో గతంలో ఏ ప్రధాని చేయనివిధంగా పలుమార్లు పర్యటించడం గమనార్హం. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. భారీ బంగారం కంటెయినర్ మాయం కేసు.. నిందితుల్లో భారత సంతతి వ్యక్తులు

20 మిలియన్‌ కెనడియన్‌ డాలర్ల విలువైన బంగారం, ఇతర వస్తువులతో ఉన్న కార్గో కంటెయినర్‌ (cargo container)ను గత ఏడాది టొరంటో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కొందరు దుండగులు చోరీ చేసిన సంగతి తెలిసిందే. కెనడా చరిత్రలోనే ఈ అతిపెద్ద దోపిడీ కేసులో పోలీసులు ఆరుగురుని అరెస్టు చేశారు. వారిలో ఇద్దరు భారత సంతతికి చెందిన వ్యక్తులు ఉన్నట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. ఆ దేశమంతా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌.. కారణమేమిటంటే..?

 ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌(work from home) విధానానికి స్వస్తి పలుకుతుంటే.. ఓ దేశం మాత్రం ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల్ని ఇంటి నుంచే పని చేయాలని ఆదేశించింది. ఈమేరకు ఆ దేశాధ్యక్షుడు ఆదేశాలు జారీ చేశారు. దక్షిణ అమెరికా దేశమైన ఈక్వెడార్‌ (Ecuador)లోని ఉద్యోగులు గురు, శుక్రవారాలు ఇంటి నుంచే పని చేయాలని అధ్యక్షుడు డేనియల్ నొబోవా వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని