Top 10 News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 28 Mar 2024 17:10 IST

1. ఆ హంతకులకు, జగన్‌కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత

హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ హైకోర్టు వద్ద గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీఎం జగన్‌ ప్రొద్దుటూరు సభలో చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్‌రెడ్డి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. నిందితులు.. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, ఉదయ్‌ శంకర్‌రెడ్డి, సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌ రెడ్డి, దస్తగిరి గురువారం కోర్టుకు హాజరయ్యారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. జగన్‌.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు

వైకాపా ప్రభుత్వం పని అయిపోయిందని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు ఎన్డీయే కూటమికి మద్దతివ్వాలని కోరారు. ‘ప్రజాగళం’ యాత్రలో భాగంగా అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. 90 శాతం హమీలు నెరవేర్చానని చెబుతున్న జగన్‌.. తన 7 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్‌ విసిరారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. పరిశ్రమలు తెచ్చి కొడంగల్‌ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్‌

తాను ఎక్కడున్నా ఓ కన్ను కొడంగల్‌పైనే ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని తెలిపారు. కొడంగల్‌లోని తన నివాసం వద్ద అభిమానులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కొడంగల్‌ నుంచి కాంగ్రెస్‌కు 50 వేల మెజార్టీ ఇవ్వాలని కోరారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. భూమా అఖిలప్రియను అడ్డుకున్న వైకాపా నేతలు.. యర్రగుంట్లలో ఉద్రిక్తత

మాజీ మంత్రి, ఆళ్లగడ్డ తెదేపా అభ్యర్థి భూమా అఖిలప్రియను వైకాపా నేతలు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో భాగంగా ఆళ్లగడ్డలో సీఎం జగన్‌ పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా ఆళ్లగడ్డలో రైతులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. అన్నదాతల సమస్యలపై సీఎంకు వినతిపత్రం అందించేందుకు భూమా అఖిలప్రియ అక్కడికి బయల్దేరారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. అచ్చెన్నపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు

రాష్ట్రంలో కలకలం రేపుతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావు, గట్టు మల్లును అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో విచారిస్తున్నారు. గట్టు మల్లు గతంలో ఎస్‌ఐబీలో సీఐగా పని చేశారు. ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావుతో వీరికి ఉన్న సంబంధాలపై దర్యాప్తు బృందం ఆరా తీస్తోంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఏప్రిల్‌ 1 నుంచి టయోటా కార్ల ధరల పెంపు

ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ (Toyota Kirloskar Motor) కార్ల ధరలను పెంచనుంది. ఎంపిక చేసిన మోడళ్లపై 1 శాతం వరకు ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. ముడి సరకుల ధరలు, నిర్వహణ ఖర్చులు పెరిగిన కారణంగా ఈ పెంపు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కేజ్రీవాల్‌కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!

మద్యం విధానం కేసు(Excise policy case)లో అరెస్టయిన ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) ఈడీ కస్టడీని దిల్లీ న్యాయస్థానం మరో నాలుగు రోజుల పాటు పొడిగించింది. ఏప్రిల్‌ 1వరకు ఆయన్ను ఈడీ కస్టడీకి అప్పగిస్తూ నిర్ణయం వెల్లడించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్‌ గాంధీ భావోద్వేగ లేఖ

సొంత పార్టీపైనే విమర్శలు చేసి వార్తల్లో నిలిచిన భాజపా (BJP) ఎంపీ వరుణ్‌ గాంధీ (Varun Gandhi)కి తాజా ఎన్నికల్లో టికెట్‌ దక్కలేదు. ఉత్తరప్రదేశ్‌లో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పీలీభీత్‌ స్థానంలో ఈసారి రాష్ట్ర మంత్రి జితిన్‌ ప్రసాదను నిలబెట్టింది కాషాయ పార్టీ. దీంతో వరుణ్‌గాంధీ భవిష్యత్తు కార్యాచరణపై ఆసక్తి రేగింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని