Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 07 Dec 2023 09:10 IST

1. నేనింకా ప్రమాణస్వీకారం చేయలేదు.. అధికారిక కాన్వాయ్‌కు నో చెప్పిన రేవంత్‌

దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన రేవంత్‌రెడ్డి బుధవారం రాత్రి 10.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. డీజీపీ రవిగుప్తా, సీఎస్‌ శాంతికుమారి సహా పలువురు ఉన్నతాధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ఆయనకు అధికారికంగా ఏర్పాటు చేసే కాన్వాయ్‌ (వాహనశ్రేణి)ని సిద్ధం చేయగా.. రేవంత్‌ వారించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. గ్యారంటీలకు ఏటా రూ.70 వేల కోట్లు!

ఎన్నికల హామీగా కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలుకు ఏటా సుమారు రూ. 70 వేల కోట్లు అవసరమని అంచనా. వీటి ముసాయిదాపై తొలుత సీఎం సంతకం చేస్తారు. అనంతరం మంత్రివర్గం భేటీ అయి.. దానికి ఆమోదం తెలుపుతుంది. అర్హులకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేసిన తర్వాత వీటికి ఎంత వ్యయమవుతుందన్న విషయంలో మరింత స్పష్టత వస్తుంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. జగన్‌ ప్రభుత్వమా.. మజాకా

వాహనాల రద్దీ పెరిగే కొద్దీ గ్రామీణ రహదారులను జిల్లా రహదారులుగా, రాష్ట్ర రహదారులుగా, జాతీయ రహదారులుగా ఉన్నతీకరించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తాయి. వైకాపా ప్రభుత్వం మాత్రం 35 రాష్ట్ర రహదారుల స్థాయి తగ్గించి జిల్లా రహదారులుగా రీ-క్లాసిఫికేషన్‌ చేస్తూ తాజాగా ఉత్తర్వు జారీచేసింది. దీనివల్ల ఆయా రోడ్లలో 1,409 కిలోమీటర్లు ఇకపై ప్రధాన జిల్లా రహదారులుగా మారినట్లు అయింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ధవళేశ్వరం యువతికి ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు

ధవళేశ్వరం కొత్తవీధికి చెందిన అంబటి కీర్తినాయుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నోటిఫికేషన్లలో ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించుకున్నారు. తాజాగా సెంట్రల్‌ బోర్డుఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సస్‌లో జీఎస్టీ ఇన్‌స్పెక్టర్‌గా కొలువు వచ్చినట్లు బుధవారం ఆమె తండ్రి అడ్వకేట్‌ అంబటి మురళీకృష్ణ తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఏడాదిలోగా మళ్లీ భారాస సర్కారే: ఎమ్మెల్యే కడియం

పార్టీ కార్యకర్తలంతా ఒక్క ఏడాది ఓపిక పట్టాలని, ఏడాదిలోపే భారాస ప్రభుత్వం తిరిగి ఏర్పాటు అవుతుందని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం జనగామ జిల్లా భారాస కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు పాగాల సంపత్‌రెడ్డి సంతాప సభలో పాల్గొన్న కడియం శ్రీహరి పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ.. గెలిచిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలంతా గందరగోళంలో ఉన్నారన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధం కావాలి

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది. అందుకు అనుగుణంగా ఈ నెల 30వతేదీలోపు రిటర్నింగ్‌ అధికారుల(ఆర్‌ఓ)తోపాటు పోలింగ్‌ విధుల్లో పాల్గొనే సిబ్బంది జాబితాను రూపొందించి, వారికి శిక్షణ ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశిస్తూ కమిషన్‌ కార్యదర్శి అశోక్‌కుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కారు దిగొచ్చి.. దివ్యాంగులతో గవర్నర్‌ ముచ్చట

రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ బుధవారం ట్యాంక్‌బండ్‌ మార్గంలో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహాన్ని సందర్శించి నివాళులర్పించారు. తిరిగి కారులో వెళుతూ సమీపంలో ఉన్న దివ్యాంగ యువకులను చూశారు. వెంటనే కారు దిగి వచ్చి వారిలో ఒకరైన భాస్కర్‌నాయక్‌తో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. 14 రైళ్ల రద్దు

మిగ్‌జాం తుపాను ప్రభావం నేపథ్యంలో ద.మ.రైల్వే జోన్‌ పరిధిలో బుధవారం 14 రైళ్లు రద్దయ్యాయి. వీటిలో చెన్నై సెంట్రల్‌-హైదరాబాద్‌ (12603), రేపల్లె-సికింద్రాబాద్‌ (17646) ఉన్నాయి. హైదరాబాద్‌-చెన్నై సెంట్రల్‌(12604) ఎక్స్‌ప్రెస్‌ను గురువారం రద్దు చేసినట్లు ద.మ.రైల్వే తెలిపింది. మరోవైపు, నిర్వహణపరమైన కారణాలతో ఆదిలాబాద్‌-హెచ్‌ఎస్‌ నాందేడ్‌ (17409)రైలును గురువారం రద్దు చేస్తున్నట్లు పేర్కొంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. యునెస్కో జాబితాలో గర్బా నృత్యం

గుజరాత్‌ సంప్రదాయ నృత్యం గర్బాకు ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ సాంస్కృతిక సంస్థ (యునెస్కో) గుర్తింపు లభించింది. ఈ విషయాన్ని బుధవారం గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌ తెలిపారు. గర్బాను.. మానవత్వ సాంస్కృతిక వారసత్వ ప్రాతినిధ్య జాబితాలో యునెస్కో చేర్చినట్లు ప్రకటించారు. ఇది గుజరాత్‌ ప్రజలకు గర్వకారణమని పేర్కొన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. మరీ ఇంత దారుణమా?.. వరద ముందస్తు చర్యలపై విశాల్‌ ఆవేదన

నటుడు విశాల్‌ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారు. తుపాను ప్రభావంతో నగరంలోని చాలా ప్రాంతాలు నీటమునిగిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి నటుడు విశాల్‌ వీడియో విడుదల చేశారు. అందులో.. ఈసారి పరిస్థితి మరింత దారుణంగా మారింది. అన్నానగర్‌లో విపరీతంగా నీళ్లు నిలిచిపోయాయి. వృద్ధులు భయాందోళనకు గురవుతున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని