Top 10 News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 22 Feb 2024 21:03 IST

1. వనం వీడి జనం మధ్యలోకి సమ్మక్క..

మేడారం జాతర (Medaram Maha Jatara)లో రెండో రోజు అత్యంత కీలక ఘట్టం ప్రారంభమైంది. వనం వీడి జనం మధ్యలోకి సమ్మక్క బయలుదేరింది. జిల్లా ఎస్పీ శబరీష్‌ గాల్లోకి కాల్పులు జరిపి అధికార లాంఛనాలతో వనదేవతకు స్వాగతం పలికారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. విద్యుత్‌ కోతలు విధిస్తే.. సస్పెండ్‌ చేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

సరైన కారణం లేకుండా కరెంట్‌ కట్ చేస్తే బాధ్యులైన అధికారులను సస్పెండ్‌ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. విద్యుత్‌ కోతలు విధించాలని ప్రభుత్వం చెప్పలేదని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. ఇటీవల పలు చోట్ల విద్యుత్‌ సరఫరా నిలిపివేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం.. కొందరు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. వాట్సప్‌లో పంపే టెక్ట్స్‌ మరింత ఆకర్షణీయంగా..

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ (WhatsApp) మరో కొత్త అప్‌డేట్‌తో ముందుకొచ్చింది. గ్రూపులు, ఇతరులకు పంపే టెక్ట్స్‌ను ఆకర్షణీయంగా మార్చేందుకు తాజాగా ఫార్మాటింగ్‌ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ విషయాన్ని మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ తన వాట్సప్‌ ఛానెల్ ద్వారా వెల్లడించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఐపీఎల్‌ షెడ్యూల్‌ వచ్చేసింది.. మార్చి 22న తొలి మ్యాచ్‌

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL 2024) కొత్త సీజన్‌ షెడ్యూల్‌ విడుదలైంది. మార్చి 22 నుంచి ఐపీఎల్‌ 17వ సీజన్‌ ప్రారంభం కానుంది. చెన్నై సూపర్ కింగ్స్‌ X రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య చెన్నైలోని చెపాక్‌ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్‌ జరగనుంది. తొలి 15 రోజుల షెడ్యూల్‌ను మాత్రమే ఐపీఎల్ నిర్వాహకులు ప్రకటించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. త్వరలోనే జనసేనలో చేరుతున్నా!: మాజీమంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు

త్వరలోనే తాను జనసేన పార్టీలో చేరుతున్నట్లు మాజీమంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఆయన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ మేరకు వెల్లడించారు. మంచి ఆశయాలు, సిద్ధాంతాలు, కమిట్మెంట్ ఉన్న గొప్ప నాయకుడని పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను ఆయన ఈ సందర్భంగా కొనియాడారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. గృహ జ్యోతి, గ్యాస్‌ సిలిండర్‌ పథకాల అమలుకు ముహూర్తం ఖరారు!

ఆరు గ్యారంటీల్లో భాగంగా కాంగ్రెస్‌ ప్రకటించిన గృహ జ్యోతి, గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు ముహూర్తం దాదాపు ఖరారైంది. ఈనెల 27 లేదా 29న ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విధివిధానాలపై కేబినెట్‌ సబ్‌ కమిటీతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సబ్సిడీ ఎలా అందించాలనే అంశంపై చర్చించారు. గ్యాస్‌ ఏజెన్సీలతో చర్చలు జరపాలని సీఎం సూచించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఆ నాలుగు దేశాలకు ఉల్లి ఎగుమతికి కేంద్రం అనుమతి

దేశంలో ఉల్లి ఎగుమతులపై నిషేధం కొనసాగుతున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 వరకు బంగ్లాదేశ్, మారిషస్‌, బెహ్రెయిన్‌, భూటాన్‌లకు 54,760 టన్నుల ఉల్లిపాయల్ని ఎగుమతి చేసేందుకు వ్యాపారులకు అనుమతి ఇచ్చింది. ఈమేరకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్‌కుమార్‌ సింగ్‌ ఓ ప్రకటన చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. సర్కారు సొమ్ముతో ఎన్నికల ప్రచారం.. జగన్‌ పర్యటనలకు 2 హెలికాప్టర్లు!

ముఖ్యమంత్రి జగన్‌ ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో రెండు హెలికాప్టర్లను సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు ఏపీ ఏవియేషన్‌ కార్పొరేషన్ సిఫార్సుతో వీటిని లీజు ప్రాతిపదికన తీసుకునేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ఇంజిన్లు కలిగిన భెల్‌ తయారీ హెలికాప్టర్లను తీసుకోవాలని నిర్ణయించారు. విజయవాడ విమానాశ్రయంలో ఒకటి, విశాఖలో మరొకటి మోహరించాలని కార్పొరేషన్‌ నిర్ణయించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. గొర్రెల పంపిణీ స్కామ్‌.. నలుగురు ప్రభుత్వ ఉద్యోగుల అరెస్టు

గొర్రెల పంపిణీ స్కామ్‌లో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. వీరిలో కామారెడ్డి వెటర్నరీ ఆసుపత్రి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రవి, మేడ్చల్‌ పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆదిత్య, రంగారెడ్డి జిల్లా భూగర్భ జల అధికారి రఘుపతిరెడ్డి, వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్‌ గణేష్‌ ఉన్నారు. నలుగురు నిందితులను నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరచగా.. మార్చి 7 వరకు రిమాండ్‌ విధించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. చెప్పినట్టుగానే అమేఠీలో ఇల్లు కట్టి.. గృహప్రవేశం చేసిన స్మృతిఇరానీ

చెప్పినట్టుగానే తన నియోజకవర్గం అమేఠీ(Amethi)లో కొత్త ఇంటిని నిర్మించుకున్నారు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ(Smriti Irani). గురువారం తన భర్త జుబిన్‌ ఇరానీతో కలిసి గృహప్రవేశం కూడా చేశారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న వేళ జరిగిన ఈ కార్యక్రమం ప్రాధాన్యం సంతరించుకుంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు