Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 02 Jun 2024 20:58 IST

1. ట్యాంక్‌బండ్‌పై ఘనంగా ‘పదేళ్ల పండుగ’ సంబురాలు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన సంబురాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ హాజరయ్యారు. గవర్నర్‌తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్రమంత్రులు, సీఎస్‌ శాంతి కుమారి తదితరులు ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రాష్ట్రాలు రెండైనా.. తెలుగువారంతా ఒక్కటే: చంద్రబాబు

రాష్ట్రాలు రెండైనా.. తెలుగువారంతా ఒక్కటేనని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఏర్పాటై పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. 10 కోట్ల తెలుగు జాతి మేటిగా వెలగాలన్నదే నా ఆకాంక్ష అని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఏపీ ఎగ్జిట్‌ పోల్స్‌... మై యాక్సిస్‌ ఇండియాటుడే అంచనాలివే

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సొంతంగా 78-96 స్థానాల్లో విజయం సాధిస్తుందని మై యాక్సిస్‌ ఇండియా టుడే సర్వే వెల్లడించింది. మిత్రపక్షాలు జనసేన 16-18 స్థానాల్లో, భాజపా 4-6 స్థానాల్లో గెలుపొందుతాయని అంచనా వేసింది. ఇక అధికార వైకాపా 55-77 స్థానాలకే పరిమితమవుతుందని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మంత్రి కోమటిరెడ్డి ఆరోపణలు రుజువు చేస్తే.. ముక్కు నేలకు రాస్తా: హరీశ్‌రావు

తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తనపై చేసిన ఆరోపణలపై భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. ‘‘నేను.. అమెరికా వెళ్లి విశ్రాంత ఐపీఎస్‌ అధికారి ప్రభాకర్‌రావును కలిసినట్టు రుజువు చేస్తే అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయడానికి సిద్ధం. రుజువు చేయకపోతే మంత్రి కోమటిరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాలి’’అని సవాల్‌ విసిరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఏపీలోకి నైరుతి రుతుపవనాలు.. పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు

నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు రావడంతో వాతావరణంలో మార్పులు సంభవించినట్టు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. మరో రెండు.. మూడు రోజుల్లో రాష్ట్రమంతటా ఈ రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్టు తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఫుడ్‌ పాయిజనింగ్‌.. 42 మంది బీటెక్‌ విద్యార్థులకు అస్వస్థత

తమిళనాడులోని చెన్నైలో ఓ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన 42 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కలుషితాహారం తిని అస్వస్థతకు గురి కావడంతో ఆదివారం ఉదయం ఆస్పత్రిలో చేరినట్లు పోలీసులు వెల్లడించారు. శనివారం రాత్రి భోజనం చేసిన విద్యార్థులు అసౌకర్యానికి గురై.. వాంతులు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అమిత్‌షాపై ఆరోపణలు.. జైరాం రమేష్‌కు ఈసీ నోటీసులు

కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు చూపాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ను ఈసీ ఆదివారం ఆదేశించింది. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా 150 మంది జిల్లా కలెక్టర్‌లకు ఫోన్‌ చేశారని జైరాం రమేష్‌ సోషల్ మీడియాలో చేసిన ఆరోపణలపై ఈసీ స్పందించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. భారత్‌తో మ్యాచ్‌ అంటే.. మాకూ టెన్షనే: బాబర్ అజామ్‌

వరల్డ్‌ కప్‌నకే ఆకర్షణగా నిలిచే భారత్ - పాకిస్థాన్‌ (IND vs PAK) మ్యాచ్ జూన్ 9న జరగనుంది. మ్యాచ్‌పై పాకిస్థాన్‌ కెప్టెన్ బాబర్ అజామ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘భారత్ - పాక్‌ జట్ల మధ్య మ్యాచ్‌ అంటే ప్లేయర్లుగా మాకూ కాస్త టెన్షన్ రావడం సహజమే. తీవ్ర ఒత్తిడి ఉండే మ్యాచ్. కూల్‌గా ఉండి ఆడగలిగితే ఫలితం అనుకూలంగా వస్తుందని నమ్ముతా’అని అన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. సినీ నటుడి బ్యాగులో 40 బుల్లెట్ల గుర్తింపు

సినీ నటుడు, మాజీ ఎమ్మెల్యే కరుణాస్‌ బ్యాగులో పెద్ద సంఖ్యలో బుల్లెట్లు బయటపడటం కలకలం రేపింది. ఆదివారం ఉదయం ఆయన విమానం ఎక్కేందుకు చెన్నై డొమెస్టిక్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. తనిఖీల సమయంలో ఆయన బ్యాగులో దాదాపు 40 బుల్లెట్లు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ప్రిన్సెస్‌ డయానా.. వేలానికి వ్యక్తిగత లేఖలు!

అందంతో పాటు తన సేవాగుణంతో అంతులేని ప్రజాభిమానం సంపాదించుకున్న బ్రిటన్‌ ప్రిన్సెస్ డయానాకు సంబంధించిన కొన్ని వస్తువులు వేలం వేయనున్నారు. తన వ్యక్తిగత సేవకుడికి రాసిన ఉత్తర ప్రత్యుత్తరాలు ఇందులో ఉన్నాయి. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక విషయాలను అందులో పంచుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని