యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానానికి తప్పిన ముప్పు

అమెరికాలో యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానానికి పెను ముప్పు తప్పింది. విమానం కుడి ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో డెన్వర్‌ విమానాశ్రయంలో అత్యవసరంగా దిగింది. విమానం ఎగురుతున్న సమయంలో కొన్ని శకలాలు కిందపడటం కలకలం రేపింది....

Published : 21 Feb 2021 13:24 IST

న్యూయార్క్‌: అమెరికాలో యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానానికి పెను ముప్పు తప్పింది. విమానం కుడి ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో డెన్వర్‌ విమానాశ్రయంలో అత్యవసరంగా దిగింది. విమానం ఎగురుతున్న సమయంలో కొన్ని శకలాలు కిందపడటం కలకలం రేపింది. లోహవిహంగం నుంచి పడిన శకలాలు కింద ఉన్న కొన్ని నివాసాల ముందు పడ్డాయి. ఇళ్లు, మనుషుల పైన శకలాలు పడకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విమానాశ్రయంలో విమానం సురక్షితంగానే దిగిందని, ప్రయాణికులకు ముప్పు తప్పిందని అధికారులు వెల్లడించారు. విమానం డెన్వర్‌ నుంచి హోనోలులుకు వెళుతుండగా ఇంజిన్‌ కాలిపోయినట్లు అధికారులు తెలిపారు. విమానం బయలుదేరిన కొద్దిసేపటికే భారీ కుదుపులకు గురి కాగా కేబిన్‌లో భారీ పేలుడు జరిగినట్లు పైలెట్‌ మైకులో ప్రకటించాడు. పొగలు కక్కుతూ తక్కువ ఎత్తులో ఎగిరిన ఈ విమానం తిరిగి డెన్వర్‌ విమానాశ్రయంలో దిగింది. ఇది కుదుపులకు గురైనప్పుడు ప్రాణాలతో బయటపడతామని తాము అనుకోలేదని ప్రయాణికులు పేర్కొన్నారు. ఈ విమానం ప్రమాదానికి గురైన సమయంలో దానిలో 231 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది ఉన్నారు.
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని