Booster dose: కొవిడ్‌ 2-3 డోసుల మధ్య విరామం ఇక 6 నెలలే..

కొవిడ్‌ టీకా రెండు, మూడు (ముందుజాగ్రత్త) డోసుల మధ్య విరామ సమయాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఇంతవరకు రెండో డోసు తీసుకున్న 9 నెలల తర్వాతే ముందుజాగ్రత్త డోసు తీసుకోవాలన్న నిబంధన ఉండగా.. తాజాగా ఈ సమయాన్ని 6

Updated : 07 Jul 2022 08:02 IST

ఈనాడు, దిల్లీ: కొవిడ్‌ టీకా రెండు, మూడు (ముందుజాగ్రత్త) డోసుల మధ్య విరామ సమయాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఇంతవరకు రెండో డోసు తీసుకున్న 9 నెలల తర్వాతే ముందుజాగ్రత్త డోసు తీసుకోవాలన్న నిబంధన ఉండగా.. తాజాగా ఈ సమయాన్ని 6 నెలలకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తగ్గించింది. ఈమేరకు ఆ శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో బుధవారం వివరాలను వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయడంతో పాటు, ఇమ్యునైజేషన్‌పై ఏర్పాటైన జాతీయ సాంకేతిక సలహా బృందం (ఎన్‌టాగీ) ఉప కమిటీ సిఫార్సుల మేరకు ఈ సవరణ చేసినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని