CDS: చైనా దూకుడు వేళ.. భారత్‌ ‘వ్యూహం’తో ముందుకెళ్లాలి: సీడీఎస్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌

చైనా దూకుడు కొనసాగుతున్న వేళ.. భారత్‌ కూడా తన వ్యూహాత్మక విధానంలో (Strategic Calculus) ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని త్రివిధ దళాధిపతి జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ పేర్కొన్నారు.

Published : 05 Oct 2023 21:33 IST

దిల్లీ: చైనా దూకుడుతో అంతర్జాతీయ వేదికపై దాని ప్రాబల్యం మరింత స్పష్టంగా కనిపిస్తోందని భారత త్రివిధ దళాధిపతి జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారత్‌ కూడా తన వ్యూహాత్మక విధానంలో (Strategic Calculus) ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో అవాంతరాలు తలెత్తుతున్న వేళ.. భారత్‌ తన వ్యూహాత్మక ప్రతిపత్తిని కొనసాగించాలని సీడీఎస్‌ స్పష్టం చేశారు.

‘కమీషన్‌’ ఇవ్వలేదని.. బుల్డోజర్లతో రోడ్డునే తవ్వేశారు!

ఇండియన్‌ ఆర్మీ, యునైటెడ్‌ సర్వీసెస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించిన ఐదో జనరల్‌ కేవీ కృష్ణారావు మెమోరియల్‌ లెక్చర్‌లో త్రివిధ దళాధిపతి జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఉత్తర సరిహద్దులో చైనాతో నెలకొన్న వివాదాలను గుర్తుచేశారు. ఈ క్రమంలో భారత్‌ తన వ్యూహాత్మక ప్రతిపత్తికి పదను పెట్టాల్సిందేనని అభిప్రాయపడ్డారు. కేవలం పొంచి ఉన్న ముప్పు నుంచి రక్షించుకోవడమే కాకుండా అవకాశాలను సద్వినియోగ పరచుకునేలా వ్యూహాత్మక ప్రతిపత్తిని కొనసాగించాలన్నారు. భవిష్యత్తులోనూ అలాగే ఉండాలని ఆకాంక్షించిన జనరల్‌ చౌహాన్.. మరిన్ని అవకాశాల కోసం ఆలోచన చేయాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని