కొవిషీల్డ్‌పై వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయండి

ఆస్ట్రాజెనకా కరోనా టీకాపై తాజా దుమారం నేపథ్యంలో కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ దుష్ప్రభావాలు, ముప్పు కారకాల అవకాశాలను పరిశీలించేందుకు వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంటూ బుధవారం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలైంది.

Published : 02 May 2024 03:48 IST

సుప్రీంకోర్టులో పిల్‌

దిల్లీ: ఆస్ట్రాజెనకా కరోనా టీకాపై తాజా దుమారం నేపథ్యంలో కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ దుష్ప్రభావాలు, ముప్పు కారకాల అవకాశాలను పరిశీలించేందుకు వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంటూ బుధవారం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలైంది. సర్వోన్నత న్యాయస్థానానికి చెందిన విశ్రాంత న్యాయమూర్తిని ఆ కమిటీకి నేతృత్వం వహించేలా చూడాలని పిటిషన్‌దారుడు, న్యాయవాది విశాల్‌ తివారి కోరారు. అంతేకాకుండా వ్యాక్సిన్‌ కారణంగా తలెత్తిన దుష్ప్రభావాలతో తీవ్ర వైకల్యం పొందినవారికి, మరణించిన వ్యక్తుల బంధువులకు పరిహారం చెల్లించేలా కేంద్రాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని