Civils Exam:సివిల్స్‌ పరీక్షలను వాయిదా వేయలేం

దేశవ్యాప్తంగా శుక్రవారం నుంచి జరగాల్సిన యూపీఎస్‌సీ సివిల్స్‌ (మెయిన్స్‌) పరీక్షలను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు గురువారం తోసిపుచ్చింది. జనవరి 7 నుంచి 16 వరకూ మెయిన్స్‌ పరీక్షలను

Updated : 07 Jan 2022 09:44 IST

పిటిషన్‌ను తోసిపుచ్చిన దిల్లీ హైకోర్టు

దిల్లీ: దేశవ్యాప్తంగా శుక్రవారం నుంచి జరగాల్సిన యూపీఎస్‌సీ సివిల్స్‌ (మెయిన్స్‌) పరీక్షలను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు గురువారం తోసిపుచ్చింది. జనవరి 7 నుంచి 16 వరకూ మెయిన్స్‌ పరీక్షలను నిర్వహించేందుకు యూపీఎస్‌సీ షెడ్యూలు విడుదల చేసింది. ఏర్పాట్లూ పూర్తయ్యాయి. కొవిడ్‌ కారణంగా కేసులు పెరుగుతున్నాయని, మెయిన్స్‌ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన 19 మంది అభ్యర్థులు పిటిషన్‌ దాఖలుచేశారు. దీనిపై గురువారం వాదోపవాదాలు జరిగాయి. యూపీఎస్‌సీ తరఫు న్యాయవాది నరేశ్‌ కౌశిక్‌ వాదనలు వినిపిస్తూ... ప్రిలిమ్స్‌ సమయంలోనూ ఇలాంటి పిటిషన్లే వచ్చాయని, సుప్రీంకోర్టు వాటిని తోసిపుచ్చిందని కోర్టు దృష్టికి తెచ్చారు. అనంతరం జస్టిస్‌ వి.కామేశ్వరరావు తీర్పు వెల్లడిస్తూ... ఈ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు. వ్యాజ్యాన్ని తోసిపుచ్చుతున్నట్టు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని