కొత్తగా 18,819 మందికి కొవిడ్‌

దేశంలో క్రమేపీ కొవిడ్‌ ఉద్ధృతి పెరుగుతోంది. గత 130 రోజుల్లో ఎన్నడూ లేనంతగా రోజువారీ కేసుల సంఖ్య 18 వేలు దాటింది. క్రియాశీలక కేసులు, పాజిటివిటీ రేటు  గురువారం ఆందోళనకర స్థాయిలో పెరిగాయి. గత 24 గంటల్లో (బుధవారం

Published : 01 Jul 2022 04:36 IST

దిల్లీ: దేశంలో క్రమేపీ కొవిడ్‌ ఉద్ధృతి పెరుగుతోంది. గత 130 రోజుల్లో ఎన్నడూ లేనంతగా రోజువారీ కేసుల సంఖ్య 18 వేలు దాటింది. క్రియాశీలక కేసులు, పాజిటివిటీ రేటు  గురువారం ఆందోళనకర స్థాయిలో పెరిగాయి. గత 24 గంటల్లో (బుధవారం ఉదయం 8 నుంచి గురువారం ఉ. 8 గంటల వరకు) కొత్తగా 18,819 మంది వైరస్‌ బారినపడ్డారు. 39 కొవిడ్‌ మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 4,34,52,164కి చేరగా.. మహమ్మారి బారినపడి ఇంతవరకు 5,25,116 మంది ప్రాణాలు కోల్పోయారు. క్రితం రోజు 3.35%గా ఉన్న పాజిటివిటీ రేటు 4.16%కి ఎగబాకింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని