విదేశాల నుంచి అక్రమమార్గాల్లో పీఎఫ్‌ఐకి నిధులు: ఈడీ

ఇస్లామిక్‌ అతివాద సంస్థ పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ)కు విదేశాల నుంచి అక్రమ మార్గాల్లో నిధులు అందుతున్నాయని శుకవ్రారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ (ఈడీ) ఒక ప్రకటనలో పేర్కొంది.

Published : 24 Sep 2022 05:39 IST

దిల్లీ: ఇస్లామిక్‌ అతివాద సంస్థ పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ)కు విదేశాల నుంచి అక్రమ మార్గాల్లో నిధులు అందుతున్నాయని శుకవ్రారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ (ఈడీ) ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘విదేశాల్లోని పీఎఫ్‌ఐ సభ్యులు ముందు తమ ఎన్‌ఆర్‌ఐ ఖాతాలకు నిధులు పంపుతున్నారు. అక్కడి నుంచి పీఎఫ్‌ఐ నేతలకు బదిలీ చేస్తున్నారు. ఈ క్రమంలో విదేశీ నిధుల నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు’’ అని ఈడీ తెలిపింది. పీఎఫ్‌ఐపై గురువారం జరిపిన దేశవ్యాప్త దాడుల్లో పర్వేజ్‌ అహ్మద్‌, మహ్మద్‌ ఇలియాస్‌, షఫీఖ్‌లను ఈడీ అదుపులోకి తీసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని