Whatsapp: వాట్సప్‌లో కొత్త ఫీచర్‌.. ఇక లింక్‌లతోనూ వాయిస్‌, వీడియో కాల్స్‌!

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ ‘వాట్సప్‌’లో ఈ వారం నుంచి కొన్ని కొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ఇకపై ఆ యాప్‌లో వీడియో, వాయిస్‌ కాల్‌ల కోసం ఇతరులను ఆహ్వానించేందుకు

Updated : 27 Sep 2022 08:46 IST

దిల్లీ: ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ ‘వాట్సప్‌’లో ఈ వారం నుంచి కొన్ని కొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ఇకపై ఆ యాప్‌లో వీడియో, వాయిస్‌ కాల్‌ల కోసం ఇతరులను ఆహ్వానించేందుకు ప్రత్యేక లింక్‌లను ఉపయోగించుకోవచ్చు. లింక్‌పై క్లిక్‌ చేసిన వెంటనే కాల్‌లో చేరేందుకు ఈ సదుపాయం వీలు కల్పిస్తుంది. వాట్సప్‌లోని ‘కాల్‌’ సెక్షన్‌లోకి వెళ్లి లింక్‌ను సృష్టించొచ్చు. ఇందుకోసం యాప్‌ను కొత్త వెర్షన్‌కు అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. వాట్సప్‌మాతృసంస్థ ‘మెటా’ సీఈవో మార్క్‌ జుకెర్‌బర్గ్‌ సోమవారం ఫేస్‌బుక్‌ వేదికగా ఈ విషయాలను వెల్లడించారు. వాట్సప్‌లో ఒకేసారి 32 మంది గ్రూప్‌ వీడియోకాల్‌ మాట్లాడుకునేందుకూ వీలు కల్పించాలని ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. సంబంధిత ప్రయోగ పరీక్షలు ప్రస్తుతం కొనసాగుతున్నట్లు చెప్పారు. ఈ ఏడాది జూన్‌ నాటికి భారత్‌లో 48.75 కోట్ల మంది వాట్సప్‌ వినియోగదారులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని