త్రిదళాధిపతిగా అనిల్‌ చౌహాన్‌ బాధ్యతల స్వీకరణ

భారత నూతన త్రిదళాధిపతి (చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌-సీడీఎస్‌)గా విశ్రాంత లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. త్రిదళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ మరణించిన తొమ్మిది నెలల తరవాత నియమితులైన అనిల్‌ చౌహాన్‌.. ఇక నుంచి భారత అత్యున్నత సైనిక కమాండర్‌గా కొనసాగనున్నారు.

Published : 01 Oct 2022 06:05 IST

దిల్లీ: భారత నూతన త్రిదళాధిపతి (చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌-సీడీఎస్‌)గా విశ్రాంత లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. త్రిదళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ మరణించిన తొమ్మిది నెలల తరవాత నియమితులైన అనిల్‌ చౌహాన్‌.. ఇక నుంచి భారత అత్యున్నత సైనిక కమాండర్‌గా కొనసాగనున్నారు. భారత ప్రభుత్వ సైనిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగానూ ఆయన విధులు నిర్వర్తించనున్నారు. బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆయన ఇండియన్‌ గేట్‌ సమీపంలోని జాతీయ యుద్ధస్మారకం వద్ద తన తండ్రి సురేంద్రసింగ్‌ చౌహాన్‌తో కలిసి అమరవీరులకు నివాళులు అర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని