Chandra grahan 2022: చంద్రగ్రహణం తర్వాత నుంచీ.. రోజూ రాత్రి ఆ ఇంట్లో మంటలు!

ఉత్తరాఖండ్‌లో అంతుచిక్కని మిస్టరీ నెలకొంది. నైనీతాల్‌ జిల్లా హల్ద్వానీలోని ఓ ఇంట్లో 8 రోజుల నుంచి రాత్రి పూట మంటలు అంటుకుంటున్నాయి.

Updated : 18 Nov 2022 07:14 IST

ఉత్తరాఖండ్‌లో అంతుచిక్కని మిస్టరీ నెలకొంది. నైనీతాల్‌ జిల్లా హల్ద్వానీలోని ఓ ఇంట్లో 8 రోజుల నుంచి రాత్రి పూట మంటలు అంటుకుంటున్నాయి. ఇలా ఎందుకు జరుగుతోందో తెలియక కుటుంబ సభ్యులు భయంతో నిద్ర లేకుండా గడుపుతున్నారు. నవంబరు 8న చంద్రగ్రహణం, భూకంపం సంభవించిన తర్వాత నుంచి ఇలా అవుతోందని వారు తెలిపారు. విద్యుత్‌ శాఖకు ఫోన్‌ చేసి ఇంటి కరెంట్‌ కనెక్షన్‌ను తప్పించినట్లు తెలిపారు.

ఆ తర్వాత కూడా ఎలక్ట్రిక్‌ బోర్డులు, వైర్లు కాలిపోతున్నాయని చెప్పారు. ఇలా 8 రోజుల్లో 20 సార్లు ఇంట్లో మంటలు వచ్చాయని, పరుపులు, అల్మారాలో ఉంచిన దుస్తులు కూడా కాలిపోయాయని చెప్పారు. విద్యుత్‌ కనెక్షన్‌ లేకున్నా కూలర్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ అయ్యి మంటలు వస్తున్నాయని తెలిపారు. విద్యుత్‌ శాఖ సాయంతో ఇంట్లో ఎర్తింగ్‌ ఏర్పాటు చేసినా కూడా మంటలు రావడం మాత్రం ఆగిపోలేదని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని