సొరంగం తవ్వి.. రైలు ఇంజిన్‌ చోరీ ?

ఓ రైలు ఇంజిన్‌ను దొంగల ముఠా మాయం చేసిన అరుదైన ఘటన బిహార్‌లో చోటు చేసుకుంది. బెగుసరాయ్‌ జిల్లా బరౌనీ ప్రాంతంలోని గర్హరా రైల్వేయార్డ్‌లో మరమ్మతుల కోసం తీసుకువచ్చిన ఓ రైలు ఇంజిన్‌ను.. కొందరు దొంగలు వారం రోజుల్లో కొన్ని ముక్కలుగా చేసి ఎత్తుకుపోయారు.

Updated : 26 Nov 2022 10:52 IST

ఓ రైలు ఇంజిన్‌ను దొంగల ముఠా మాయం చేసిన అరుదైన ఘటన బిహార్‌లో చోటు చేసుకుంది. బెగుసరాయ్‌ జిల్లా బరౌనీ ప్రాంతంలోని గర్హరా రైల్వేయార్డ్‌లో మరమ్మతుల కోసం తీసుకువచ్చిన ఓ రైలు ఇంజిన్‌ను.. కొందరు దొంగలు వారం రోజుల్లో కొన్ని ముక్కలుగా చేసి ఎత్తుకుపోయారు. ఇంజిన్‌లోని రాగితీగలు, అల్యూమినియం ప్లేట్‌లను బస్తాల్లో తరలించి వివిధ జిల్లాలోని తుక్కు దుకాణాల్లో అమ్మేశారు. ఈ చోరీ కోసం ఆ దొంగల ముఠా ప్రత్యేక సొరంగ మార్గాన్ని కూడా ఏర్పాటు చేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, రైల్వే స్పెషల్‌ విజిలెన్స్‌ బృందం నవంబరు 18న గర్హరా పరిసర ప్రాంతాల్లోని కొన్ని స్క్రాప్‌ గోడౌన్‌లపై దాడులు చేసి కొన్ని ఇంజిన్‌ భాగాలను స్వాధీనం చేసుకున్నారు. దొంగల ముఠా నాయకుడు చందన్‌కుమార్‌తో పాటు.. మరో ఇద్దరు దొంగల్ని పట్టుకున్నారు. వారిని విచారించి ముజఫర్‌పుర్‌ జిల్లాలోని ఓ గోదాముపై దాడి చేసి దాదాపు రూ.30 లక్షల విలువ చేసే 13 బస్తాల ఇంజిన్‌ విడిభాగాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే తూర్పు మధ్య రైల్వే అధికారులు ఈ వార్తలపై స్పందిస్తూ.. రైలు ఇంజిన్‌ చోరీ జరగలేదని..అది ఒక నకిలీ వార్తని పేర్కొన్నారు. అయితే బరౌని స్టేషన్‌ సమీపంలో ఓ రైల్‌ ఇంజిన్‌ నుంచి కొన్ని కేబుళ్లను  అపహరించారని స్పష్టం చేశారు. దొంగలందరినీ అరెస్టు చేశారని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని