Ladakh: లోయలో పడిపోయిన వాహనం.. 9 మంది సైనికుల దుర్మరణం

లద్దాఖ్‌లోని లేహ్‌ జిల్లాలో శనివారం సాయంత్రం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది సైనికుల్ని పొట్టనపెట్టుకుంది.

Updated : 20 Aug 2023 08:00 IST

లద్దాఖ్‌లో ఘోర ప్రమాదం

లేహ్‌: లద్దాఖ్‌లోని లేహ్‌ జిల్లాలో శనివారం సాయంత్రం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది సైనికుల్ని పొట్టనపెట్టుకుంది. దక్షిణ లద్దాఖ్‌లోని న్యోమా వద్ద సాయంత్రం 4.45 గంటల ప్రాంతంలో 10 మంది సైనికులతో వెళ్తున్న వాహనం ఒక్కసారిగా జారి, లోతైన లోయలో పడిపోయింది. పోలీసు బలగాలు అక్కడకు హుటాహుటిన చేరుకుని, గాయపడిన సైనికుల్ని సైనిక వైద్య కేంద్రానికి తరలించారు. అప్పటికే 8 మంది ప్రాణాలు కోల్పోగా, మరికొన్ని క్షణాల్లో ఇంకొకరు చనిపోయారు. చికిత్స కొనసాగుతున్న మరో సైనికుడి పరిస్థితి ప్రమాదకరంగానే ఉందని అధికార వర్గాలు తెలిపాయి.

అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ల సంతాపం

రోడ్డు ప్రమాదంలో సైనికులు చనిపోవడంపై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ తీవ్ర సంతాపం తెలిపారు. దేశానికి వారు అందించిన అపూర్వమైన సేవల్ని ఎన్నటికీ మరిచిపోబోమని ట్వీట్‌ చేశారు. శౌర్య పరాక్రమాలున్న సైనికుల్ని ఘోర ప్రమాదంలో కోల్పోవడం విషాదకరమని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు యావద్దేశం అండగా నిలుస్తుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని