Published : 12 May 2022 01:58 IST

Google Chrome: ‘క్రోమ్‌’ యూజర్లకు సెక్యూరిటీ వార్నింగ్‌.. అర్జెంట్‌గా బ్రౌజర్‌ను అప్‌డేట్‌ చేసుకోండి!

ఇంటర్నెట్‌డెస్క్‌: యూజర్లకు మెరుగైన సేవలందిస్తూ ఎప్పటికప్పుడు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది గూగుల్  క్రోమ్ (Chrome Browser). ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా మూడు బిలియన్లకు పైగా వినియోగదారులను సొంతం చేసుకుంది. అయితే, తాజాగా ఈ బ్రౌజర్‌లో కొన్ని భద్రత లోపాలు తలెత్తాయని.. దీనివల్ల యూజర్ల డేటా హ్యాకర్ల చేతికి చేరే అవకాశం ఉందని గూగుల్‌ క్రోమ్‌ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. 

‘‘క్రోమ్‌ బ్రౌజర్లలో 13 సెక్యూరిటీ థ్రెట్స్‌ను కనుగొన్నాం. ఇందులో ఇప్పటికే తొమ్మిదింటిని గుర్తించి సీవీఈ (Common Vulnerabilities and Exposures) నంబర్లను కేటాయించాం. అయితే, హ్యకర్స్‌ డేటా చోరీకి పాల్పడ్డారా? అనే దానిపై స్పష్టమైన ఆధారాలు లేవు. కానీ, యూజర్లు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. వీలైనంతా త్వరగా బ్రౌజర్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలి’’ అని ఆయన సూచించారు. 

బ్రౌజర్ సెక్యూరిటీని దాటి, యూజర్ల సమాచారాన్ని హ్యాక్ చేయడానికే హ్యాకర్లు ప్రయత్నిస్తుంటారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న గూగుల్.. క్రోమ్‌ బ్రౌజర్‌కు ఎమర్జెన్సీ అప్‌డేట్లు తీసుకొచ్చింది. క్రోమ్‌ను వీలైనంత త్వరగా అప్‌గ్రేడ్ చేసుకోవాలని యూజర్లను అలర్ట్‌ చేస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా డెస్క్‌టాప్‌ యూజర్ల కోసం 101.0.4951.64 వెర్షన్‌ను విడుదల చేసింది.

ఎలా అప్‌డేట్ చేసుకోవాలి? 

📌 గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ ఓపెన్ చేయాలి. తర్వాత కుడివైపు మూడు చుక్కలపై క్లిక్ చేసి కిందకు స్క్రోల్‌ చేస్తే సెట్టింగ్స్ కనిపిస్తాయి. 

📌 సెట్టింగ్స్‌ ఓపెన్ చేస్తే ‘అబౌట్‌ క్రోమ్‌’ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే మీ బ్రౌజర్‌ అప్‌డేట్ కాకుంటే రీలాంచ్‌ చేసి అప్‌డేట్ చేయాలి.

📌 ఒకవేళ మీ బ్రౌజర్‌ ఆటోమేటిగ్గా అప్‌డేట్ అయితే మీకు లేటెస్ట్ వెర్షన్‌ను చూపిస్తుంది.

Read latest Latest News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts