Mohan Juneja: ‘కేజీయఫ్‌’ నటుడు కన్నుమూత

కన్నడ నటుడు మోహన్‌ జునేజా(54) కన్నుమూశారు.

Updated : 07 May 2022 17:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కన్నడ నటుడు మోహన్‌ జునేజా(54) కన్నుమూశారు. హాస్యనటుడిగా కన్నడ చిత్ర పరిశ్రమకు సుపరిచితుడైన ఆయన ‘కేజీయఫ్‌’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. కనిపించేది కొద్దిసేపే అయినా, హీరో పాత్రను ఎలివేట్‌ చేసే సన్నివేశాల్లో తళుక్కున మెరిశారు. గత కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు. చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాసం విడిచినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. కన్నడలో శంకర్‌నాగ్‌ ‘వాల్‌ పోస్టర్‌’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన మోహన్‌ 100కు పైగా చిత్రాల్లో నటించారు. మోహన్‌ మృతి పట్ల హోంబాలే ఫిల్మ్‌ విచారం వ్యక్తం చేసింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించింది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని