Bigg BossTelugu 7: టికెట్‌ టు ఫినాలే.. శివాజీకి షాకిచ్చిన బిగ్‌బాస్‌

Updated : 28 Nov 2023 18:27 IST

హైదరాబాద్‌: బిగ్‌బాస్‌ సీజన్‌-7కు (Bigg Boss Telugu 7) మరో మూడు వారాలే మిగిలిన ఉన్న నేపథ్యంలో ఈ వారం టికెట్‌ టు ఫినాలే రేస్‌ జరుగుతోంది. ఇందులో భాగంగా బిగ్‌బాస్‌ పూలను సేకరించే టాస్క్‌ ఇచ్చాడు. అతి తక్కువ పూలు తెచ్చిన వాళ్లు ఈ రౌండ్‌ నుంచి ఎలిమినేట్‌ అవుతారని చెప్పాడు. ఈ క్రమంలో శివాజీ, శోభలు అతి తక్కువ పూలు తీసుకురావడంతో వారిద్దరూ ఎలిమినేట్‌ అయినట్లు ప్రకటించిన బిగ్‌బాస్‌ వారి వద్ద ఉన్న పూలు మిగిలిన పోటీదారుల్లో ఒకరికి ఇవ్వాలని సూచించాడు. దీంతో వెంటనే శివాజీ దగ్గరకు వచ్చిన అమర్‌.. ‘నాకు మాట ఇచ్చావు. టికెట్‌ టు ఫినాలేలో సాయం చేస్తానని’ అని అన్నాడు. ‘నీకు శోభ ఇస్తుంది’ అని శివాజీ అనగా, ‘నువ్వు కూడా ఇవ్వు’ అన్నాడు. వీరి మధ్య సంభాషణ విన్న బిగ్‌బాస్‌ ‘ఇద్దరూ కలిసి ఒకే కంటెస్టెంట్‌కు ఇవ్వాలని సూచించడంతో శివాజీ షాకయ్యాడు. మరోవైపు శోభ బాధపడుతూ కనిపించింది. మరి శివాజీ ఏ నిర్ణయం తీసుకున్నాడో తెలియాలంటే ఎపిసోడ్‌ చూడాల్సిందే.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని