వీరయ్య ఎన్నో సవాళ్లని అధిగమించారు: చిరంజీవి
ప్రముఖ హాస్య నటుడు పొట్టి వీరయ్య మృతి పట్ల చిరంజీవి సంతాపం తెలియజేశారు. చిత్ర పరిశ్రమకు వీరయ్య అందించిన సేవల్ని కొనియాడారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ హాస్య నటుడు పొట్టి వీరయ్య మృతి పట్ల చిరంజీవి సంతాపం తెలియజేశారు. ‘వీరయ్య వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో సవాళ్లని అధిగమించి, వందల చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మరణించారన్న వార్త నన్ను ఎంతో కలచి వేసింది. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని అన్నారు.
వీరయ్య నిన్న మృతిచెందిన విషయం తెలిసిందే. గుండెపోటుకి చికిత్స పొందుతూ హైదరబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. ‘అగ్గిదొర’ చిత్రంతో తెరంగ్రేటం చేసిన ఆయన ఎన్టీఆర్, కాంతారావు, ఎంజీఆర్, శివాజీ గణేశన్, రజనీకాంత్, కృష్ణ తదితర అగ్ర కథానాయకులతో కలిసి తెరను పంచుకున్నారు.
వైకల్యాన్ని జయించారు: జీవిత రాజశేఖర్
నటులు రాజశేఖర్, జీవిత దంపతులు వీరయ్యకు నివాళులు అర్పించారు. వీరయ్య కుటుంబ సభ్యుల్ని పరామర్శించి, సానుభూతి వ్యక్తం చేశారు. వీరయ్యతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘వీరయ్య గారు తెలియని వాళ్లు ఉండరేమో. అగ్ర హీరోలందరితో ఆయన నటించారు. మాతోనూ కలిసి నటించారు. వైకల్యాన్ని జయించిన వీరుడు వీరయ్య. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) మీటింగ్స్, అవార్డుల వేడుక.. ఇలా ఏ కార్యక్రమానికి పిలిచినా తప్పకుండా పాల్గొనేవారు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండేవారు. అలాంటి ఆయన మరణం బాధ కలిగించింది. ఆయన కుటుంబానికి వీలైనంత సహాయం చేయాలని అనుకుంటున్నాం’ అని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా బ్యాంకు అకౌంట్ హ్యాక్ అవలేదు.. నేనే రూ.3500 కోసం రిక్వెస్ట్ పెట్టా!
Renu Desai: రూ.3500 కావాలంటూ రేణుదేశాయ్ పెట్టిన పోస్ట్ సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. -
గాయంతోనే కేన్స్‌కు ఐశ్వర్యరాయ్.. వీడియో వైరల్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్‌కు గాయమైంది. దీంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. -
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఊర్వశి హొయలు.. సక్సెస్ జోష్‌లో అదితి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఫొటోలు మీకోసం.. -
మీరు అలా అంటుంటే ఆశ్చర్యంగా ఉంది: శివానీ రాజశేఖర్
తనను ఇన్‌స్టా ఇన్ఫ్లూయెన్సర్ అనడంపై ఆశ్చర్యం వ్యక్తంచేశారు నటి శివానీ రాజశేఖర్. -
ఆ షూటింగ్లో రెండు భుజాలకు ఎన్నో గాయాలయ్యాయి: జాన్వీ కపూర్
‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ షూటింగ్ అనుభవాలను జాన్వీ కపూర్ పంచుకున్నారు. -
అసలైన విజయమంటే అదే.. బర్త్‌డే రోజు రామ్ ఆసక్తికర పోస్ట్
మనకు నచ్చింది చేయగలగడమే అసలైన విజయమని రామ్ పోతినేని అన్నారు. -
ఇలా చేయడం సరికాదు: ‘సెపరేషన్’ పోస్ట్ ట్రోల్స్‌పై జీవీ ప్రకాశ్
తనపై కొందరు ట్రోల్స్ చేయడం బాధగా ఉందని సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ పేర్కొన్నారు. -
విమర్శలు వచ్చినా.. ‘యానిమల్’ హిట్‌కు కారణమిదే: మనోజ్ బాజ్‌పాయ్
సినిమాలు చూడాలా, లేదా అనే విషయంలో ప్రేక్షకులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ అన్నారు. -
తప్పుడు వార్తలపై మెహరీన్ అసహనం.. క్షమాపణ చెప్పాలని డిమాండ్
తనపై తప్పుడు వార్తలు ప్రచురించడంపై నటి మెహరీన్ అసహనం వ్యక్తం చేశారు. -
హీరోయిన్లు ఆ విషయంలోనూ పోరాడుతున్నారు: సోనాక్షి సిన్హా
పారితోషికం విషయంలో హీరోయిన్లు పోరాటం చేస్తున్నారని నటి సోనాక్షి సిన్హా అన్నారు. -
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
ముంబయిలోని అటల్ సేతుపై ప్రయాణించిన సినీనటి రష్మిక తన అనుభూతిని షేర్ చేసుకున్నారు. -
బికినీలో అనన్య పాండే.. కాబోయే భర్తతో వరలక్ష్మి ఫొటో
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఫొటోలు మీకోసం.. -
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌కు ఆహ్వానం
‘భరత్ అనే నేను’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ నటి కియారా అడ్వాణి. ఆమె అరుదైన అవకాశం దక్కింది. -
పిల్లల జీవితాన్ని ఎవరు రిస్క్‌లో పెట్టమన్నారు: రష్మి
తాండూరులో చిన్నారిపై పెంపుడు కుక్క దాడి చేసిన ఘటనకు సంబంధించి యాంకర్ రష్మిని ఉద్దేశిస్తూ ఎక్స్ వేదికగా పెట్టిన పోస్టులకు ఆమె తిరిగి సమాధానం ఇచ్చారు. -
రూ.కోటి విరాళమిచ్చిన ధనుష్.. దేనికోసమంటే!
హీరో ధనుష్ (Dhanush) రూ.కోటి విరాళం అందించారు. -
హాలీవుడ్ ‘డ్యూన్..’ వెబ్ సిరీస్‌లో టబు.. ఏపాత్రలో అంటే!
ప్రముఖ నటి టబు హాలీవుడ్ వెబ్ సిరీస్‌లో కీలకపాత్రలో నటించనున్నారు. -
చరణ్ వల్లే ఆ డిప్రెషన్ నుంచి బయటపడ్డా: ఉపాసన
రామ్ చరణ్ వల్లే ప్రసవానంతర డిప్రెషన్ నుంచి బయటపడినట్లు ఉపాసన తెలిపారు. -
రష్మిక ‘బీచ్’ ఫొటోషూట్.. అదాశర్మ సినిమా ముచ్చట!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఫొటోలు మీకోసం.. -
గత ఎన్నికల్లో మౌనవ్రతం అని చెప్పానేమో..!: చిరంజీవి ఫన్నీ కామెంట్స్
తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సంబంధిత ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. -
నీ ఓటు ఎటువైపు పోవాలో నీ చేతుల్లోనే ఉంది.. ఓటు విలువ చెప్పిన హీరోలు
పలు సినిమాల్లోనూ ఓటు హక్కు ప్రయోజనాన్ని తెలియజేస్తూ వచ్చిన సన్నివేశాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికగా ట్రెండ్ అవుతున్నాయి. -
నంద్యాల పర్యటనపై క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్
ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకే నంద్యాల వెళ్లానని సినీ నటుడు అల్లు అర్జున్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఒక్క మ్యాచ్ ఫలితం.. మూడు జట్లపై ప్రభావం?
-
బ్లింకిట్‌లో కొత్తిమీర ఫ్రీ.. ఆ తల్లి సూచనతో సీఈవో నిర్ణయం
-
ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు
-
నా బ్యాంకు అకౌంట్ హ్యాక్ అవలేదు.. నేనే రూ.3500 కోసం రిక్వెస్ట్ పెట్టా!
-
నాపై అనర్హత వేటు కక్షపూరిత చర్య: జంగా కృష్ణమూర్తి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM