Etv win: ఈటీవీ విన్‌లో ప్రణయ విలాసం

‘ప్రేమలు’ సినిమాలో తన నటనతో సినీప్రియులను మెప్పించింది మలయాళ కథానాయిక మమితా బైజు. ఆమె, అర్జున్‌ అశోకన్‌ జంటగా నటించిన చిత్రం ‘ప్రణయ విలాసం’. నిఖిల్‌ మురళి తెరకెక్కించారు.

Updated : 03 May 2024 10:00 IST

‘ప్రేమలు’ సినిమాలో తన నటనతో సినీప్రియులను మెప్పించింది మలయాళ కథానాయిక మమితా బైజు. ఆమె, అర్జున్‌ అశోకన్‌ జంటగా నటించిన చిత్రం ‘ప్రణయ విలాసం’. నిఖిల్‌ మురళి తెరకెక్కించారు. రొమాంటిక్‌ కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని గ్రీన్‌ రూమ్‌ ప్రొడక్షన్‌ పతాకంపై సీబీ చవరా, రెంజిత్‌ నాయర్‌ సంయుక్తంగా నిర్మించారు. అనస్వరా రాజన్‌, మియా జార్జ్‌ కీలక పాత్రలు పోషించారు. ఇటీవలే విడుదలైన ఈ మలయాళ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో గోపిక పాత్రలో కనిపించి ప్రశంసలు అందుకుంది మమితా బైజు. తెలుగులో ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఆ గోపిక ప్రేమకథ ఏంటో, ఈ ప్రయాణంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొందో మీరు చూసేయండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని