Kubera: ‘కుబేర’లో నాగ్‌ ఇలా!

నాగార్జున, ధనుష్‌ ప్రధాన పాత్రల్లో శేఖర్‌ కమ్ముల తెరకెక్కిస్తోన్న చిత్రం ‘కుబేర’. సునీల్‌ నారంగ్‌, పుస్కుర్‌ రామ్‌ మోహన్‌రావు నిర్మిస్తున్నారు. గురువారం ఈ చిత్రంలో నాగార్జునకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ వీడియోని విడుదల చేసింది చిత్రబృందం.

Updated : 03 May 2024 09:51 IST

నాగార్జున, ధనుష్‌ ప్రధాన పాత్రల్లో శేఖర్‌ కమ్ముల తెరకెక్కిస్తోన్న చిత్రం ‘కుబేర’. సునీల్‌ నారంగ్‌, పుస్కుర్‌ రామ్‌ మోహన్‌రావు నిర్మిస్తున్నారు. గురువారం ఈ చిత్రంలో నాగార్జునకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ వీడియోని విడుదల చేసింది చిత్రబృందం. అందులో నాగార్జున భారీగా డబ్బులున్న కంటైనర్‌ ముందు వర్షంలో గొడుగు పట్టుకొని నడిచొస్తున్నట్టు కనిపించింది. ఆ వర్షంలో ఓ కరెన్సీ నోటు కింద బురదలో పడి ఉంటుంది. అప్పుడు తన జేబులోంచి ఓ నోటు తీసి ఆ కంటైనర్‌లో ఉన్న డబ్బుల మధ్య పెడతారు నాగార్జున. రష్మిక, జిమ్‌ సర్భ్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌, ఛాయాగ్రహణం: నికేత్‌ బొమ్మి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని