Raviteja: రవితేజ వల్లే నా కల నిజమైంది.. 13 ఏళ్ల సినీప్రయాణంపై దర్శకుడి ట్వీట్‌

గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రం ‘డాన్‌ శ్రీను’ విడుదలై 13 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఆయన రవితేజను ఉద్దేశిస్తూ ట్వీట్‌ చేశారు.

Published : 06 Aug 2023 13:49 IST

హైదరాబాద్: హీరో రవితేజ (Raviteja)- దర్శకుడు గోపిచంద్‌ మలినేనిల హిట్‌ కాంబినేషన్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్స్‌ ఉంటారు. ఈ మాస్‌ కాంబోలో తెరకెక్కిన తొలి చిత్రం ‘డాన్‌ శ్రీను’ విడుదలై 13 ఏళ్లు పూర్తయింది. గోపిచంద్‌ మలినేనికి కూడా ఇదే తొలి చిత్రం కావడం విశేషం. ఈ సందర్భంగా రవితేజతో తనకున్న అనుబంధాన్ని ఆయన ట్విటర్‌లో పంచుకున్నారు.

‘‘నా తొలి చిత్రం విడుదలై 13 ఏళ్లు పూర్తయింది. నాకు సినిమాలపై ఉన్న అభిరుచి రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. రవితేజ వల్లే నా కల సాకారమైంది. నా మీద నమ్మకంతో ‘డాన్‌ శ్రీను’లో నటించడానికి ఆయన అంగీకరించారు. ఇన్ని సంవత్సరాలుగా నా సినిమాలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు, ప్రత్యేకించి మాస్‌ మహారాజ్‌ రవితేజ అభిమానులకు ధన్యవాదాలు. ఆయనతో నా సినీ ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. త్వరలోనే మిమ్మల్ని నాలుగోసారి అలరించడానికి సిద్ధమవుతున్నాం’’ అంటూ రవితేజతో ఉన్న ఫొటోలను పంచుకున్నారు. 

అదెంతో క్లిష్టమైన సమయం.. కన్నీటి పర్యంతమైన హీరోయిన్‌

ఇప్పటి వరకు రవితేజ, గోపిచంద్ మలినేనిల (Gopichand Malineni) కాంబినేషన్‌లో ‘డాన్‌ శ్రీను’, ‘బలుపు’, ‘క్రాక్‌’ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఈ హిట్ కాంబో మరోసారి బాక్సాఫీస్‌ వద్ద మ్యాజిక్‌ క్రియేట్‌ చేయడానికి సిద్ధమైంది. రవితేజ ప్రస్తుతం ‘టైగర్‌ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao)లో నటిస్తున్నారు. వంశీ దర్శకత్వంలో ఇది తెరకెక్కుతోంది. స్టూవర్టుపురంలోని గజదొంగ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. 1970ల నేపథ్యంలో సాగే ఈ సినిమా రవితేజకు తొలి పాన్‌ ఇండియా చిత్రం కావడం విశేషం. ఈ మూవీ అక్టోబర్‌20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక దీని తర్వాత గోపిచంద్‌ మలినేని సినిమా పట్టాలెక్కనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని