Kalyan ram: కల్యాణ్‌రామ్‌.. కొత్త సినిమా మొదలు

నందమూరి కల్యాణ్‌ రామ్‌ కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఆయన హీరోగా నటిస్తున్న ఈ సినిమాని ప్రదీప్‌ చిలుకూరి తెరకెక్కిస్తున్నారు.

Updated : 21 Oct 2023 13:39 IST

నందమూరి కల్యాణ్‌ రామ్‌ కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఆయన హీరోగా నటిస్తున్న ఈ సినిమాని ప్రదీప్‌ చిలుకూరి తెరకెక్కిస్తున్నారు. అశోక్‌ వర్ధన్‌ ముప్పా, సునీల్‌ బలుసు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సయీ మంజ్రేకర్‌ కథానాయిక. విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పిస్తున్నారు. ఈ చిత్రాన్ని హైదరాబాద్‌లో శుక్రవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి విజయశాంతి క్లాప్‌ కొట్టగా.. మురళీ మోహన్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. వెంకయ్య చౌదరి స్క్రిప్ట్‌ అందించారు. ‘‘ఈ సినిమా కల్యాణ్‌ రామ్‌ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయేలా ఉంటుంది. ఆయన మునుపెన్నడూ చూడని శక్తిమంతమైన పాత్రలో కనిపిస్తారు. దీన్ని భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నాం. త్వరలోనే ఇతర నటీనటుల వివరాల్ని వెల్లడిస్తాం’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం అందిస్తున్నారు. సి.రామ్‌ప్రసాద్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని