NTR 31: అక్టోబరులో మొదలు!

‘కేజీఎఫ్‌’, ‘సలార్‌’ సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే.

Updated : 02 May 2024 09:46 IST

‘కేజీఎఫ్‌’, ‘సలార్‌’ సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. నిజానికి ఇది ఈపాటికే చిత్రీకరణ ప్రారంభించుకోవాల్సి ఉన్నప్పటికీ తారక్‌ ‘వార్‌ 2’తో.. ప్రశాంత్‌ నీల్‌ ‘సలార్‌ 2’ పనులతో బిజీగా ఉండటంతో ఆలస్యమైంది. అయితే ఇది ఈ ఏడాదిలోనే రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభించుకోనున్నట్లు తెలిసింది. అక్టోబరు నుంచి ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అప్పటికి ఎన్టీఆర్‌ ‘వార్‌ 2’ని కూడా పూర్తి చేయనున్నారని తెలుస్తోంది. ఇక మరోవైపు ఈ సినిమా మొదలయ్యే లోగా ప్రశాంత్‌ నీల్‌తో ‘సలార్‌ 2’ని ప్రారంభించేందుకు హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ యత్నిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. త్వరలోనే దీనిపైనా స్పష్టత రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని