Poonam Pandey: నటి, మోడల్‌ పూనమ్‌ పాండే మృతి

Poonam Pandey: నటి, మోడల్‌ పూనమ్‌ పాండే మృతిచెందినట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె సర్వైకల్‌ క్యాన్సర్‌తో చనిపోయినట్లు సమాచారం.

Updated : 02 Feb 2024 15:02 IST

ఇంటర్నెట్ డెస్క్‌: బాలీవుడ్‌ నటి, మోడల్ పూనమ్‌ పాండే (32) (Poonam Pandey) మృతి చెందారు. గత కొంతకాలంగా సర్వైకల్‌ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె.. శుక్రవారం తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయినట్లు నటి మేనేజర్‌ మీడియాకు వెల్లడించారు. పూనమ్‌ మరణం గురించి శుక్రవారం ఉదయం ఆమె ఇన్‌స్టా ఖాతాలో వ్యక్తిగత సిబ్బంది పోస్ట్‌ చేయడంతో ఈ వార్త ఇండస్ట్రీని షాక్‌కు గురి చేసింది.

మోడల్‌గా కెరీర్‌ ఆరంభించిన పూనమ్‌ 2013లో ‘నషా’తో బాలీవుడ్‌లో తెరంగ్రేటం చేశారు. పలు హిందీ సినిమాల్లో నటించిన ఆమె.. ప్రముఖ నటి కంగనా రనౌత్‌ హోస్ట్‌గా వ్యవహరించిన లాకప్‌ తొలి సీజన్‌లో పాల్గొన్నారు.

2011 వన్డే ప్రపంచకప్‌ టోర్నీ సందర్భంగా చేసిన ఓ ప్రకటనతో పూనమ్‌ చాలా పాపులర్‌ అయ్యారు. ఆమె వైవాహిక జీవితం కూడా వివాదాస్పదమైంది. భర్త తనను శారీరకంగా చిత్రహింసలకు గురిచేస్తున్నాడంటూ అప్పట్లో పోలీసులను ఆశ్రయించారు. ఆ తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు