Salaar: థియేటర్ల వద్ద ‘సలార్‌’ సందడి.. వైరల్‌ వీడియోలు చూశారా!

‘సలార్’ (Salaar) చూసేందుకు ప్రేక్షకులు థియేటర్ల వద్ద క్యూ కట్టారు. దీంతో పండగ వాతావరణం నెలకొంది.

Updated : 22 Dec 2023 11:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘సలార్’తో ప్రభాస్‌ (Prabhas) సూపర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రశాంత్‌నీల్‌ టేకింగ్‌కు అభిమానులతో పాటు యాక్షన్‌ ప్రియులు ఫిదా అవుతున్నారు. నేడు విడుదలైన ఈ సినిమాను (salaar) చూసేందుకు ప్రేక్షకులు థియేటర్ల వద్దకు పోటెత్తారు. ఇక చాలా రోజుల తర్వాత ప్రభాస్‌ భారీ హిట్‌ అందుకునే సరికి అభిమానుల సందడి ఆకాశాన్నంటింది. పలు చోట్ల టపాసులు కాల్చి.. పాలాభిషేకాలు, డ్యాన్స్‌లతో అభిమానాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సినిమా చూసిన సినీ ప్రముఖులు కూడా సోషల్‌ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు.

15 ఏళ్ల క్రితమే బీజం పడింది.. ‘సలార్‌’ గురించి ఈ విశేషాలు తెలుసా?

‘కేజీయఫ్‌’ తర్వాత ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వంలో వచ్చిన సినిమా కావడం, ప్రభాస్ పోస్టర్లు ఆకట్టుకోవడంతో ‘సలార్’పై అంచనాలు పెరిగాయి. దేవ పాత్రలో ప్రభాస్‌.. వ‌ర‌ద రాజమ‌న్నార్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్‌ అదరగొట్టారు. ఆద్యగా శ్రుతిహాసన్‌ ఆకట్టుకుంది. ఎలాంటి ముందస్తు వేడుకలు లేకుండా విడుదలై ఈ సినిమా హిట్‌ను సొంతం చేసుకోవడంతో అభిమానులు ఖుష్‌ అవుతున్నారు.






Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని