Manisha Koirala: ‘హీరామండి’ షూటింగ్‌లో డిప్రెషన్‌లోకి వెళ్లా: మనీషా కొయిరాల

‘హిరామండి’ షూటింగ్‌ సమయంలో డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు మనీషా కొయిరాల తెలిపారు.

Published : 10 May 2024 18:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘హీరామండి’ షూటింగ్‌ సమయంలో డిప్రెషన్‌కు వెళ్లినట్లు నటి మనీషా కొయిరాలా (Manisha Koirala) తాజాగా వెల్లడించారు. ‘బొంబాయి’ (Bombay)తో దక్షిణాది సినీప్రియులకు చేరువైన ఆమె ఆ సినిమా విజయం తర్వాత పలు కోలీవుడ్‌ చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆ తర్వాత క్యాన్సర్‌ బారిన పడడంతో కొన్నేళ్లపాటు విరామం తీసుకున్నారు. ఇటీవల సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘హీరామండి’ వెబ్‌ సిరీస్‌లో మల్లికాజాన్‌గా తన నటనతో ఆకట్టుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సిరీస్‌ షూటింగ్ సమయంతో కలిగిన అనుభవాన్ని పంచుకున్నారు.

‘క్యాన్సర్‌ నుంచి కోలుకున్న తర్వాత జీవితం మునుపటిలా ఉండదు. తెలియకుండానే శరీరంలో మార్పులు వస్తాయి. ‘హీరామండి’ షూటింగ్‌ సమయంలో డిప్రెషన్‌లోకి వెళ్లా. సడెన్‌గా ఆలోచనలు మారిపోయేవి. మూడ్‌ స్వింగ్స్‌ ఎక్కువయ్యాయి. ముందు షూటింగ్‌ను పూర్తి చేయాలి. తర్వాత ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి అని నాలో నేనే ఎన్నోసార్లు అనుకున్నా. నా పరిస్థితిని దర్శకుడు సంజయ్‌ అర్థం చేసుకున్నారు. 12 గంటలు కాగానే నా పాత్ర చిత్రీకరణ నిలిపేసేవారు. నా భయాన్ని, ఆందోళనను ఆయన బాగా అర్థం చేసుకున్నారు’ అని మనీషా చెప్పారు. 2012లో ఆమె అండాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్నట్లు వెల్లడించారు. 2014లో దానినుంచి కోలుకున్నట్లు తెలిపారు.

మా ఇద్దరిలో కామన్‌ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న

ఇటీవల మనీషా సోషల్‌మీడియా వేదికగా ఒక ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు ‘జీవితంలో నేను కృతజ్ఞతతో ఉండాల్సిన క్షణాలు చాలా ఉన్నాయి. ఎన్నో ముఖ్యమైన పాత్రలు చేశాను. గొప్ప దర్శక నిర్మాతలతో పని చేశాను. కాలం నాకు పెట్టిన పరీక్షలో నెగ్గాను. భగవంతుడి దయతో జీవించడానికి నాకు రెండో అవకాశం లభించింది. క్యాన్సర్‌తో పోరాడిన తర్వాత ఒడుదొడుకులు చూశా. కాలం పెద్ద గురువు. నేను ఇప్పుడు దాని విలువను తెలుసుకున్నా’ అని అందులో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు