Fahadh Faasil: అందుకే సెల్ఫీ అడిగితే పారిపోతా: ఫహద్‌ ఫాజిల్‌

ఎవరైనా సెల్ఫీ అడిగితే తాను పారిపోతానని నటుడు ఫహద్‌ ఫాజిల్‌ పేర్కొన్నారు.

Published : 10 May 2024 18:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సెట్స్‌లో స్టార్ట్‌.. కెమెరా.. యాక్షన్ అనగానే నటులంతా ఆయా పాత్రల్లో ఒదిగిపోతుంటారు. కానీ, కొందరు తెర వెనక ఫొటోలు దిగాలన్నా, నలుగురిలో మాట్లాడాలన్నా మొహమాటపడుతుంటారు. ఎవరైనా సెల్ఫీ కోరినా సున్నితంగా తిరస్కరిస్తారు. తానూ అదే కోవకు చెందుతానన్నారు మలయాళ విలక్షణ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ (Fahadh Faasil). తన కొత్త సినిమా ‘ఆవేశం’ (Aavesham) ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఫొటోలకు పోజిలివ్వడం తనకు రాదని, అందుకే ఎవరైనా సెల్ఫీ కోసం వస్తే అక్కడినుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తానని నవ్వుతూ చెప్పారు. తన గురించి తెలిసిన అభిమానులు మాత్రం ఫొటోల కోసం చుట్టుముట్టరని, చూసి చిరునవ్వు చిందిస్తారని పేర్కొన్నారు.

‘పుష్ప2’ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే విలన్‌ మీరేనా? ఫహద్‌ సమాధానం ఇదే!

బాక్సాఫీసు వద్ద రూ. 150 కోట్లకుపైగా వసూళ్లు సాధించిన ‘ఆవేశం’ ప్రస్తుతం ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది. అల్లు అర్జున్‌ ‘పుష్ప 2’ (Pushpa 2), రజనీకాంత్‌ ‘వేట్టయాన్‌’ (Vettaiyan)లో ఆయన కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు