SIIMA 2023: ‘సైమా అవార్డ్స్‌’.. ఉత్తమ దర్శకుడు నామినేషన్లు ఇవే

సైమా 2023 ఉత్తమ దర్శకుడు నామినేషన్ల జాబితా వెలువడింది. ఎవరెవరు పోటీ పడుతున్నారో చూసేయండి..

Published : 04 Aug 2023 02:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన చిత్రాలు, నటులు సాంకేతిక నిపుణుల ప్రతిభను గుర్తించి ఇచ్చే ప్రతిష్ఠాత్మక అవార్డు ‘సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) (SIIMA 2023 Nominations). ఈ ఏడాది సెప్టెంబరు 15, 16 తేదీల్లో జరగనున్న ఈ వేడుకకు దుబాయ్‌ వేదిక కానుంది. ఈ అవార్డ్స్‌కు పోటీ పడుతున్న చిత్రాల జాబితాను ఇటీవల విడుదల చేసిన ‘సైమా’ (SIIMA) టీమ్ తాజాగా డైరెక్టర్ల లిస్ట్‌ రిలీజ్‌ చేసింది. టాలీవుడ్‌ నుంచి ఎస్‌. ఎస్‌. రాజమౌళి (SS Rajamouli) (ఆర్‌ఆర్‌ఆర్‌), హను రాఘవపూడి (Hanu Raghavapudi) (సీతారామం), చందూ మొండేటి (Chandoo Mondeti) (కార్తికేయ 2), శశికిరణ్‌ తిక్కా (Sashi Kiran Tikka)(మేజర్‌), విమల్‌ కృష్ణ (డీజే టిల్లు) (Vimal Krishna) ఈ పోటీలో నిలిచారు. గతేడాది విడుదలై, ప్రేక్షకాదరణ పొందిన చిత్రాలు, వాటికి సంబంధించిన వారి ప్రతిభను గుర్తించి ఈ అవార్డులకు నామినేట్‌ చేస్తున్నారు. కన్నడ, మలయాళం, తమిళం దర్శకులు జాబితాను కింది ఫొటోల్లో చూడొచ్చు.

‘నేనేమీ క్లబ్‌లో డ్యాన్స్‌ చేయలేదు.. బ్రో’పై మళ్లీ మాట్లాడిన మంత్రి అంబటి!

‘ఉత్తమ చిత్రం’ కేటగిరిలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’, సిద్ధు జొన్నలగడ్డ నటించిన ‘డీజే టిల్లు’, నిఖిల్‌ హీరోగా తెరకెక్కిన మిస్టరీ అడ్వెంచర్‌ ఫిల్మ్‌ ‘కార్తికేయ2’, అడివి శేష్‌ ‘మేజర్‌’తో పాటు డీసెంట్‌ బ్లాక్‌బస్టర్‌ ‘సీతారామం’ పోటీ పడుతున్నాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఏకంగా 11 కేటగిరిల్లో నామినేషన్స్‌ దక్కించుకుంది. తర్వాత, 10 కేటగిరిల్లో ‘సీతారామం’కి నామినేషన్స్‌ దక్కాయి. తమిళంలో అత్యధికంగా 10 నామినేషన్స్‌ ‘పొన్నియిన్‌ సెల్వన్‌-1’ (Ponniyin Selvan:1) చిత్రానికి దక్కాయి. కమల్‌హాసన్‌-లోకేష్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘విక్రమ్‌’ (Vikram) 9 నామినేషన్స్‌ను దక్కించుకుంది. కన్నడలో చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపించిన రిషబ్‌శెట్టి ‘కాంతార’ (Kantara), యశ్‌, ప్రశాంత్‌ నీల్‌ మాస్‌, యాక్షన్‌ మూవీ ‘కేజీయఫ్‌2’ (KGF Chapter 2)లకు 11 కేటగిరిల్లో నామినేషన్స్‌ దక్కాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని