Sobhita Dhulipala: ప్రారంభంలో ప్రతీది ఓ యుద్ధమే: శోభితా ధూళిపాళ్ల

ప్రస్తుతం ‘ది నైట్‌ మేనేజర్‌ 2’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు నటి శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala). ఇందులో భాగంగా తన కెరీర్‌ ప్రారంభ రోజులను గుర్తుచేసుకుంది.

Published : 23 Jun 2023 15:13 IST

హైదరాబాద్‌: ఇటీవల ‘పొన్నియిన్‌ సెల్వన్‌2’లో కనిపించి అలరించింది శోభితా ధూళిపాళ్ల. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో పెద్ద సినిమాల్లో అవకాశాలు అందుకుంటుంది. త్వరలోనే ‘ది నైట్‌ మేనేజర్‌ 2’తో (The Night Manager 2) పలకరించనుంది. అనిల్‌ కపూర్‌ (anil kapoor), ఆదిత్యరాయ్‌ కపూర్‌ (adityaroy kapur) నటించిన ఈ వెబ్‌ సిరీస్‌ ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’ (Disney+ Hotstar)లో జూన్‌ 30 నుంచి ప్రసారం కానుంది. దీని ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శోభిత.. తన కెరీర్‌ ప్రారంభ రోజులను గుర్తు చేసుకుంది. సినిమాల్లోకి రాకముందు ఎన్నో విమర్శలు వచ్చాయని తెలిపింది.

‘‘ఏ రంగంలోనైనా ప్రారంభం ఒక యుద్ధంలా అనిపిస్తుంది. నేను ప్రకటనల్లో నటించేటప్పుడు తెల్లగా లేనని ఎంతో మంది అన్నారు. అందంగా లేనని ఆ యాడ్‌లకు సరిపోనని నా మొహం మీదే చెప్పారు. అయినా నేను నిరాశ పడలేదు. నా దృష్టిలో అందమనేది ఎదుటి వారి ఆలోచనలకు సంబంధించిన విషయం. నా రూపాన్ని చూసి ప్రజలు ఏమనుకుంటారో అని ఆలోచించడం మానేశాను. దానికి బదులుగా  సృజనాత్మకంగా, కొత్తగా ఉండడానికి ప్రయత్నించాను. నేను చేసే పనిపై శ్రద్ధ పెంచుకున్నాను. అదే నన్ను ఇండస్ట్రీలో భాగమయ్యేలా చేసింది. కమర్షియల్‌ సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తూ కూర్చోకుండా.. వచ్చిన ప్రతి సినిమా ఆడిషన్స్‌కు వెళ్లాను. మొదటిసారి అనురాగ్‌ కశ్యప్‌తో కలిసి పనిచేశాను. ఆ సినిమాతో చాలా పాఠాలు నేర్చుకున్నాను. నటించాలనే తపన ఉన్నప్పుడు ఏ కష్టం కూడా బాధించదని నా అభిప్రాయం. మొదటి ఆడిషన్‌కు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఒకేలా కష్టపడుతున్నాను’’ అని చెప్పింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని