Vijay-Rashmika: విజయ్‌ దేవరకొండ-రష్మికల జోడి మరోసారి మెరవనుందా!

విజయ్‌ దేవరకొండ-రష్మిక జోడి మరోసారి స్క్రీన్‌పై మెరవనున్నట్లు తెలుస్తోంది. 

Published : 10 May 2024 17:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వెండితెరపై కొన్ని జోడీలకు ప్రత్యేకమైన ఫ్యాన్స్‌ ఉంటారు. అలాంటి ఒక జోడీనే విజయ్‌ దేవరకొండ-రష్మికలది (Rashmika). ‘గీత గోవిందం’తో మంచి ఆన్‌స్క్రీన్‌ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ జంట రెండోసారి ‘డియర్‌ కామ్రేడ్‌’తో అలరించింది. ఇప్పుడు మరోసారి వీళ్లిద్దరూ స్క్రీన్‌పై మెరవనున్నట్లు జోరుగా ప్రచారమవుతోంది. ప్రస్తుతం ఈ వార్త వైరల్‌గా మారడంతో విజయ్‌ (Vijay devarakonda), రష్మికల అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఖుష్‌ అవుతున్నారు.

విజయ్‌ పుట్టినరోజు సందర్భంగా ఒక కొత్త సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘టాక్సీవాలా’ , ‘శ్యామ్‌ సింగరాయ్‌’తో మెప్పించిన రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ఇది రానుంది. ఈ చిత్రంలో రష్మికను తీసుకోవాలనే ఆలోచనలో ఉందట చిత్రబృందం. VD14 అనే వర్కింగ్‌టైటిల్‌తో పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా రానుంది. 18వ శతాబ్దంలో జరిగిన చారిత్రక సంఘటనల ఆధారంగా రానున్న ఈ చిత్రంలో హీరోయిన్‌ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం ఉండనుందట. అందుకే రష్మిక అయితే బాగుంటుందని ఆమెను తీసుకోవాలని భావిస్తోందట మూవీ యూనిట్‌. ఇక రష్మికతో కలిసి మరోసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకునేందుకు ఆశగా ఎదురుచూస్తున్నట్లు విజయ్‌ ఇటీవల చెప్పారు.    మంచి కథ ఉంటే తప్పకుండా కలిసి నటిస్తామన్నారు. దీంతో VD14లో వీళ్లిద్దరి జోడి కనిపించే అవకాశముందని అభిమానులు అనుకుంటున్నారు.

మా ఇద్దరిలో కామన్‌ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న

ఇక విజయ్‌ సినిమాకు సంబంధించిన మరో వార్త కూడా సోషల్ మీడియాలో షేర్‌ అవుతుంది. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో నటించనున్న సినిమాలో (#VD12) హీరోయిన్‌గా శ్రీలీలను ప్రకటించారు. అయితే తాజాగా ఆమె స్థానంలో మమితా బైజు (Mamitha Baiju), భాగ్యశ్రీ బోర్సేల్లో ఒకరిని తీసుకోనున్నట్లు టాక్‌ వినిపిస్తుంది. మమితాతో చిత్రబృందం సంప్రదింపులు జరిపిందని.. ఆమె గ్రీన్‌ స్నిగల్‌ ఇచ్చారని సమాచారం. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది. ఈ రెండు సినిమాలతో పాటు రవికిరణ్‌ కోలా దర్శకత్వంలో ఈ రౌడీ హీరో ఒక సినిమా చేయనున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని