Saindhav: నా బుజ్జికొండవే..!

వెంకటేశ్‌ నటించిన 75వ చిత్రం ‘సైంధవ్‌’. శైలేశ్‌ కొలను తెరకెక్కించిన ఈ పాన్‌ ఇండియా సినిమాని వెంకట్‌ బోయనపల్లి నిర్మించారు. శ్రద్ధా శ్రీనాథ్‌ కథానాయిక.

Updated : 30 Dec 2023 09:49 IST

వెంకటేశ్‌ నటించిన 75వ చిత్రం ‘సైంధవ్‌’. శైలేశ్‌ కొలను తెరకెక్కించిన ఈ పాన్‌ ఇండియా సినిమాని వెంకట్‌ బోయనపల్లి నిర్మించారు. శ్రద్ధా శ్రీనాథ్‌ కథానాయిక. రుహాని శర్మ, ఆండ్రియా, బేబీ సారా, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఈ చిత్రం నుంచి ‘‘బుజ్జికొండవే.. నా బుజ్జికొండవే’’ అనే గీతాన్ని విడుదల చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన కూతుర్ని తలచుకుంటూ తండ్రిగా వెంకటేశ్‌ పడే ఆవేదనని ఈ పాటలో భావోద్వేగభరితంగా చూపించారు. ఈ గీతానికి సంతోష్‌ నారాయణన్‌ స్వరాలు సమకూర్చగా.. రామజోగయ్య శాస్త్రి సాహిత్యమందించారు. ఎస్పీ చరణ్‌ ఆలపించారు. ఈ పాటను బట్టి సినిమా ప్రధానంగా తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో సాగనున్నట్లు అర్థమవుతోంది. ఈ చిత్రానికి కూర్పు: గ్యారీ బిహెచ్‌, ఛాయాగ్రహణం: యస్‌.మణికందన్‌.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని