Siddaramaiah: ఇంకా వాళ్లు లౌకికవాదులేనా?భాజపాతో జేడీఎస్‌ పొత్తుపై సిద్ధరామయ్య

లోక్‌సభ ఎన్నికల్లో భాజపా-జేడీఎస్‌ కలిసి పోటీ చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఇకపై జేడీఎస్‌ సెక్యులర్‌ పార్టీ అని చెప్పొద్దని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆ పార్టీకి సూచించారు.

Published : 27 Sep 2023 18:59 IST

బెంగళూరు: జేడీఎస్‌ ( JDS)కు ఇకపై తమది లౌకికవాద పార్టీ అని చెప్పే అర్హత లేదని కర్ణాటక (Karnataka) ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) విమర్శించారు. ప్రస్తుతం జేడీఎస్ పేరులో మాత్రమే సెక్యులర్‌ ఉందని, ఎన్నికల కోసమే ఆ పార్టీ భాజపాతో చేతులు కలిపిందని ఎద్దేవా చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా-జేడీఎస్ పొత్తుపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘పేరుకు మాత్రమే జేడీఎస్‌ సెక్యులర్‌ పార్టీ. ఇప్పుడు నిజంగా వాళ్లు లౌకికవాదులేనా? భాజపాతో పొత్తు తర్వాత కూడా జేడీఎస్‌ తమది సెక్యులర్‌ పార్టీ అని చెబుతుందా? ఆ పార్టీ చెప్పేది ప్రజలు నమ్ముతారా?’’ అని సిద్ధరామయ్య ప్రశ్నించారు. భాజపా-జేడీఎస్‌ కలిసి పోటీ చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఇకపై జేడీఎస్‌ సెక్యులర్‌ పార్టీ అని చెప్పొద్దని సిద్ధరామయ్య సూచించారు.

మోదీకి పట్నాయక్‌ 8 రేటింగ్‌ ఇస్తే.. భాజపా మాత్రం నవీన్‌కు 0 ఇచ్చింది!

అంతకుముందు భాజపాకు జేడీఎస్‌ బీ-టీమ్‌ అంటూ కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలను కుమారస్వామి ఖండించారు. దేశవ్యాప్తంగా లౌకికవాదాన్ని కాంగ్రెస్‌ నాశనం చేస్తోందని, కర్ణాటకలో ఆ పార్టీతో పొత్తు తర్వాత జేడీఎస్‌ను అణచివేయాలని చూసిందంటూ తీవ్ర విమర్శలు చేశారు. 2004లో ప్రభుత్వ ఏర్పాటు కోసం సిద్ధరామయ్య భాజపా నాయకుల్ని కలిసేందుకు ప్రయత్నించారని కుమారస్వామి ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను సిద్దరామయ్య ఖండించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని