icon icon icon
icon icon icon

Chandrababu: సీఎం సెక్యూరిటీ సిబ్బందిపై ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు

స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద సీఎం సెక్యూరిటీ సిబ్బంది పార్టీ నిర్వహించడంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి తెదేపా అధినేత చంద్రబాబు ఫిర్యాదు చేశారు.

Updated : 15 May 2024 22:12 IST

అమరావతి: గుంటూరు నాగార్జున యూనివర్సిటీ స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద సీఎం సెక్యూరిటీ సిబ్బంది పార్టీ నిర్వహించడంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనాకు తెదేపా అధినేత చంద్రబాబు ఫిర్యాదు చేశారు. స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన సీఎం సెక్యూరిటీ సిబ్బంది.. సిద్ధం పోస్టరు, వైకాపా డీజే పాటలతో పార్టీ నిర్వహించారని లేఖలో పేర్కొన్నారు. ఇందులో 450మందికి పైగా పోలీసులు పాల్గొన్నారని తెలిపారు. ఈ విందు నిర్వహించిన సీఎం సెక్యూరిటీ గ్రూప్‌ ఎస్పీ అట్టాడ బాపూజీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని సీఈవోను చంద్రబాబు కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img