Atchannaidu: ఓటర్‌ లిస్ట్‌ కంటే.. వైకాపా పెట్టిన అక్రమ కేసుల లిస్టే పెద్దది: అచ్చెన్న

రాష్ట్రంలో ఓటర్ల లిస్ట్‌ కంటే వైకాపా ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల లిస్టే ఎక్కువగా ఉందని తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.

Updated : 17 Nov 2023 12:45 IST

అమరావతి: రాష్ట్రంలో ఓటర్ల లిస్ట్‌ కంటే వైకాపా ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల లిస్టే ఎక్కువగా ఉందని తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని ప్రశ్నిస్తున్న మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ ఛైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. నాలుగున్నరేళ్లుగా తెలుగుదేశం నేతలపై వందలాది అక్రమ కేసులు పెట్టి ఏం సాధించారని ప్రశ్నించారు. పాడి రైతుల ప్రగతికి కృషి చేస్తున్న నరేంద్ర.. రైతులపై దాడి చేయించారంటే ఎవరైనా నమ్ముతారా అని నిలదీశారు. 

ధూళిపాళ్ల నరేంద్రపై హత్యాయత్నం కేసు

సంగం డెయిరీని ఆక్రమించుకోవాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించకపోవడంతో.. ఇప్పుడు ఇలా అక్రమ కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. ఎన్నికలకు ఇక ఐదు నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయని.. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి అని ప్రభుత్వానికి సవాల్‌ విసిరారు. రాష్ట్ర ప్రజలు వైకాపాను తన్ని తరిమేస్తారని అచ్చెన్న హెచ్చరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని