ఎన్నికల నిబంధనల ఉల్లంఘన.. ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యేలపై కేసుల నమోదు

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఇద్దరు ఎమ్మెల్యేలతోపాటు ఓ ఎంపీ అభ్యర్థిపై కేసులు నమోదయ్యాయి.

Published : 20 Apr 2024 03:09 IST

మంచిర్యాల నేర విభాగం, ఆదిలాబాద్‌ నేర విభాగం, న్యూస్‌టుడే: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఇద్దరు ఎమ్మెల్యేలతోపాటు ఓ ఎంపీ అభ్యర్థిపై కేసులు నమోదయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాల కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు ఈ నెల 17న పాత మంచిర్యాలలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొని ఆలయ అభివృద్ధికి హామీలు ఇవ్వడంతోపాటు ఆర్థిక సహాయం అందించారు. ఎన్నికల అధికారుల ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసినట్లు మంచిర్యాల సీఐ బన్సీలాల్‌ తెలిపారు. నీ శ్రీరామనవమి రోజు శోభాయాత్రలో ఫ్లెక్సీపై ఆదిలాబాద్‌ భాజపా ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ ఫొటో ఉండటంతో బుధవారం రాత్రి ఒక కేసు నమోదైంది. అదే రోజు అనుమతి లేకుండా శ్రీరామనవమి శోభాయాత్రలో పాల్గొన్నందుకు ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌, ఆదిలాబాద్‌ భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్‌పై శుక్రవారం మరో కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్‌ వన్‌టౌన్‌ సీఐ సత్యనారాయణ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని