గట్టుప్పల్‌ ఇన్‌ఛార్జిగా కేటీఆర్‌.. మర్రిగూడకు హరీశ్‌రావు!

మునుగోడు ఉపఎన్నికలో కేటీఆర్‌, హరీశ్‌రావు సహా ఇతర మంత్రులను యూనిట్‌ ఇన్‌ఛార్జులుగా నియమించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మునుగోడును 86 యూనిట్లుగా చేసి.. మంత్రులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించనున్నారు.

Published : 04 Oct 2022 03:38 IST

మంత్రులకు ఉపఎన్నిక బాధ్యతలు అప్పగించనున్న సీఎం

ఈనాడు, హైదరాబాద్‌: మునుగోడు ఉపఎన్నికలో కేటీఆర్‌, హరీశ్‌రావు సహా ఇతర మంత్రులను యూనిట్‌ ఇన్‌ఛార్జులుగా నియమించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మునుగోడును 86 యూనిట్లుగా చేసి.. మంత్రులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించనున్నారు. గట్టుప్పల్‌ ఎంపీటీసీ యూనిట్‌ ఇన్‌ఛార్జిగా కేటీఆర్‌, మర్రిగూడ ఎంపీటీసీ యూనిట్‌ ఇన్‌ఛార్జిగా హరీశ్‌రావును నియమించనున్నారని తెలిసింది. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి మునుగోడు ఎంపీటీసీ యూనిట్‌ ఇన్‌ఛార్జిగా ఉంటారు. గిరిజనులు, మైనారిటీ ఓటర్లతో భేటీల బాధ్యతలు మంత్రులు సత్యవతి రాథోడ్‌, మహమూద్‌ అలీకి ఇవ్వనున్నారని తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని